క్రీడాభూమి

నిదాస్ ట్రోఫీ టీ-20 ముక్కోణపు వనే్డ సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, పిబ్రవరి 21: కోహ్లీ సేన దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన వెంటనే శ్రీలంక వేదికగా ముక్కోణపు వనే్డ కోసం సన్నద్ధం కానుంది. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య శ్రీలంకలో ముక్కోణపు వనే్డ సిరీస్ జరుగనుంది. మార్చి 6 నుంచి 18 వరకు నిదాస్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ బోర్డు తాజాగా వెల్లడించింది. నిదాస్ ట్రోఫీ టీ-20 ముక్కోణుపు వనే్డ సిరీస్ క్రికెట్ టోర్నమెంట్ మార్చి 6వ తేదీ నుంచి 18 వరకు ఇక్కడి ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతాయి.
శ్రీలంక 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తారు. వేసవికాలం సందర్భంగా అన్నీ డే నైట్ మ్యాచ్‌లేనని నిర్వాహకులు ప్రకటించారు. ఈ సిరీస్‌లో ప్రతి జట్టు తప్పకుండా మిగతా జట్లతో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. టోర్నమెంట్‌లో టాప్‌లో నిలిచిన రెండు జట్లు మార్చి 18న జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌లో తలపడతాయి. శ్రీలంక స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న త్రికోణపు టీ-20 సిరీస్ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ భారత్, బంగ్లాదేశ్‌తో పాటు టోర్నమెంట్‌కు అతిధ్యమిస్తున్న శ్రీలంక జట్టు పాల్గొంటాయని శ్రీలంక క్రికెట్ ప్రెసిడెంట్ తిలంగా సుమతిపాలా వెల్లడించారు. ఇండియా, దక్షిణాఫ్రికా టూర్‌ను ముగించుకున్న వెంటనే ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, భారత్ జట్లు టోర్నమెంట్‌లో పాల్గొని తాము జరుపుకునే శ్రీలంక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వాములు కావాలని తిలింగా సుమతిపాల పిలుపునిచ్చారు.
టోర్నమెంట్ షెడ్యూల్ వివరాలు
మార్చి 6న ప్రారంభమయ్యే టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ శ్రీలంక-ఇండియా జట్ల మధ్య జరుగుతుంది. అదేవిధంగా మిగతా మ్యాచ్‌లు మార్చి 8న బంగ్లాదేశ్-ఇండియా, 10న శ్రీలంక-బంగ్లాదేశ్, 12న ఇండియా-శ్రీలంక, 14న ఇండియా-బంగ్లాదేశ్, 16న బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌లు జరుగుతాయి. చివరిగా ఫైనల్ మ్యాచ్ మార్చి 18న ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు.
కామనె్వల్త్ బరిలో సింధు, శ్రీకాంత్
ఢిల్లీ, ఫిబ్రవరి 21: కామనె్వల్త్ క్రీడల్లో బాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో టాప్ సీడ్ భారత్ బలమైన జట్టును బరిలో దించనుంది. మేటి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్.ప్రణయ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో పసిడి పతకం కోసం పోరాటం చేయనున్నారు. భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) ఈ జట్టును ప్రకటించింది. ఏప్రిల్ 5న ఆస్ట్రేలియా ఆరంభం కానున్న మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్ గ్రూప్-ఎ జరిగే మ్యాచ్‌లో పాల్గొంటుంది.
భారత జట్టు:
పురుషులు: శ్రీకాంత్, ప్రణయ్, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, ప్రణయ్ జెర్రీ చోప్రా.
మహిళలు: పీవీ సింధు, సైనా నేహ్వాల్, అశ్విని, సిక్కిరెడ్డి, రుత్విక శివాని.