క్రీడాభూమి

భారత హాకీ మాజీ కోచ్‌పై పాక్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఫిబ్రవరి 21: భారత హాకీ జట్టు మాజీ కోచ్ రోలన్ట్ ఆల్టమన్స్‌పై పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్‌ఎఫ్) కనే్నసింది. ఆల్టమన్స్ నేతృత్వంలో భారత హాకీ జట్టు ఎన్నో విజయాలను నమోదు చేసింది. తమకన్నా బలమైన జట్లను సైతం ఓడించిన ఘనతను సాధించిందంటే అదంతా అప్పటి కోచ్ ఆల్టమన్స్ చలవే. ఆల్టమన్స్ 2003-2004 మధ్య పాక్ హాకీ జట్టుకు కోచ్‌గా సేవలు అందించాడు. ఒమన్‌లో జరిగే పాకిస్తాన్, జపాన్, ఒమన్ ముక్కోణపు టోర్నీ సందర్భంగా ఆల్టమన్స్ సేవలను పాక్ వినియోగించుకోవాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కామనె్వల్త్ గేమ్స్‌కు ముందుగానే ఆల్టమన్స్‌ను తమ దేశ హాకీ జట్టుకు సేవలు అందించేందుకు మళ్లీ పంపాలని పాక్ హాకీ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఒమన్ పర్యటనలో ఉన్న ఆల్టమన్స్ పాక్ హాకీ ఫెడరేషన్‌తో ప్రెసిడెంట్, సెక్రెటరీతో ఈ విషయమై చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ అతను పాక్ కోచ్‌గా సేవలు అందించేందుకు అంగీకరిస్తే అతనికి కొత్తగా బాధ్యతలు అప్పజెబుతారు. ఏప్రిల్‌లో జరుగబోయే కామనె్వల్త్ గేమ్స్‌లో అతని సేవలు తమ దేశానికి ఉపయోగపడతాయని పాక్ హాకీ ఫెడరేషన్ భావిస్తోంది. 2013 నుండి భారత హాకీ జట్టులో గట్టి అనుబంధం ఉన్న ఆల్టమన్స్ పాకిస్తాన్ కోచ్‌గా వెళ్లేందుకు తుది నిర్ణయం కోసం కొద్దిరోజుల కిందట సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆల్టమన్స్ 2015లో భారత జట్టు కోచ్‌గా ఎంపికైన తీరు అప్పట్లో వివాదాస్పదమైంది. ఆయన నేతృత్వంలో ఎన్నో విజయాలను అందుకున్న టీమిండియా గత ఏడాది ఆశించిన మేరకు రాణించలేదు. ప్రపంచ కప్‌లో అర్హత సాధించేందుకు భారత్ ఆపసోపాలు పడింది. ఈ నేపథ్యంలో ఆల్టమన్స్‌ను కోచ్ పదవి నుండి హాకీ ఇండియా గత సెప్టెంబర్‌లో తొలగించింది.
అమెరికా రైడర్ కప్ టీమ్ వైస్ కెప్టెన్‌లుగా
టైగర్ ఉడ్స్, స్టీవ్ స్టయికర్
లాస్ ఏంజిల్స్, ఫిబ్రవరి 21: అమెరికా రైడర్ కప్ టీమ్ వైస్ కెప్టెన్‌లుగా టైగర్ ఉడ్స్, స్టీవ్ స్టయికర్‌లను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని టీమ్ కెప్టెన్ జిమ్ ఫురిక్ ఫ్లోరిడా పామ్ బీచ్ గార్డెన్స్‌లో ప్రకటించారు. రైడర్ కప్ సెప్టెంబర్ 28 నుండి 30 వరకు ఫ్రాన్స్‌లోని లీ గోల్ఫ్ నేషనల్స్‌లో జరుగుతుంది. 1993 నుంచి ఇప్పటివరకు అమెరికన్లు యూరోప్‌లో గెలవలేదు. జిమ్ ఫురిక్ 2012 నుండి 2016 వరకు రైడర్ కప్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఉడ్స్, స్టయికర్ గత ఏది అమెరికన్ ప్రెసిడెంట్ కప్ టీమ్ విన్నింగ్ టీమ్‌లో అసిస్టెంట్‌లుగా సేవలు అందించారు. ఉడ్స్ 2016లో హజిల్టయిన్‌లో జరిగిన యూఎస్ రైడర్ కప్‌లో అసిస్టెంట్‌గా వ్యవహరించాడు.