బిజినెస్

దేశీయ భద్రతకు జాతీయ ఏకీకృత వ్యూహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: ప్రస్తుత వివిధ రాష్ట్రాల్లో అంతరంగికభద్రతకు ఇవిధ రకాలైన వ్యూహాలు, సొల్యూషన్స్ ఉన్నాయని, వీటి వల్ల గందరగోళం నెలకొని ఉందని, జాతీయ స్థాయిలో భద్రతకు ఏకీకృత వ్యూహ విధానం అమలు చేయాలని అసోచామ్ అనే జాతీయ వాణిజ్య సంస్థ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను కోరింది. పారదర్శకంగా, సమగ్రంగా మార్గదర్శకాలను, విధానాలను దేశీయ భద్రత నిమిత్తం రూపొందించాలని అసోచామ్ హోంల్యాండ్ సెక్యూరిటీ డిజిటల్ ఫ్రాంటియర్స్ పేరిట విడుదల చేసిన విధానపత్రంలో పేర్కొంది. ప్రస్తుతం ఇంధనం, టెలికాం, రవాణా తదితర రంగాల్లో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, సరైన భద్రత విధానం లేనం దు వల్ల దేశంలో సైబర్ భద్రతకు విఘాతం కలుగుతోందన్నారు. స్మార్ట్ హోంల్యాండ్ ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. సరైన టెక్నెలజీ ద్వారా ఇంటెలిజెన్స్ విధానాన్ని అమలుచేస్తూ సేకరించిన డాటాను విశే్లషించే విధానం అమలులోకి రావాలన్నారు. పౌరుల భద్రత, సురక్షితానికి అనిలిటిక్స్‌ను వినియోగించాలన్నారు. హై ఎండ్ సైబర్ ల్యాబ్స్, సైబర్ సెక్యూరిటీని పెంచాలన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని పారిశ్రామిక వాడల్లో సైబర్ ల్యాబ్స్ ఉండాలన్నారు.
దీని వల్ల ఆర్థిక రంగం, ప్రభుత్వ శాఖలకు ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను అధిగమించవచ్చన్నారు. సైబర్ క్రైమ్ ఇన్విస్టిగేటర్లు, ప్రొఫెషనల్స్‌కు హోంల్యాండ్ సెక్యూరిటీపై శిక్షణ ఇవ్వాలన్నారు.

శ్రీలంక బస్సులో పేలుడు
19 మందికి తీవ్ర గాయాలు
కొలంబో, ఫిబ్రవరి 21: శ్రీలంకలో బుధవారం ఒక బస్సుల్లో భారీ పేలుడు సంభవించడంతో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 12 మంది ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందినవారు ఉన్నారు. అయితే పేలుడుకు కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. ఉగ్రవాద చర్యకూ అవకాశం లేకపోలేదని మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు. బస్సు దియంతలావా నుంచి జాఫ్నాకు వెళుతుండగా, ఉదయం 5.45 గంటల సమయంలో పేలుడు సంభవించిందని మిలిటరీ ప్రతినిధి బ్రిగేడియర్ సుమిత్ అటపట్టు విలేఖరులకు తెలిపారు. తీవ్రంగా గాయడిన వారిలో ఏడుగురు ఆర్మీ, ఐదుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఉన్నట్లు ఆయన తెలిపారు. మిగతా వారంతా సాధారణ పౌరులేనని ఆయన వివరించారు. పేలుడు ధాటికి బస్సు చాలాభాగం ధ్వంసమైంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని అటపట్టు తెలిపారు. శ్రీలంక గతంలో ఎల్‌టీటీఈ ఉగ్రవాదుల దాడులతో భీతిల్లిన విషయం తెలిసిందే.
జాఫ్నా కేంద్రంగా లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) 30 ఏళ్లపాటు జరిపిన వేర్పాటువాద పోరాటంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎల్‌టీటీఈ అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ మరణానంతరం ఉగ్రవాద కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్ పడింది.