హైదరాబాద్

108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: అత్యవసర సమయాల్లో ఎంతోమందిని ఆదుకుంటున్న 108 ఉద్యోగులు పని ఒత్తిడి, చాలీచాలని వేతనాలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం తెలంగాణ 108 ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 108 ఉద్యోగుల మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం సంఘం అధ్యక్షుడు అశోక్‌తో కలిసి మాట్లాడారు. జీవో నెంబర్ 14 ప్రకారం ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణిస్తూ, వారికి ఎనిమిది గంటల పనివిధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని పట్టుపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో 31 జిల్లాలకు చెందిన 108 ఉద్యోగులు పాల్గొన్నారు.