కృష్ణ

‘విజిలెన్సు’ పేరిట టోకరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు, ఫిబ్రవరి 21: విజిలెన్స్ అధికారులమని బెదిరించి రు.50వేలు దోపిడీ చేసిన అగంతకుల ఉదంతం బుధవారం పోలీసుల దృష్టికి వచ్చింది. పట్టణ పోలీసుల కథనం ప్రకారం స్థానిక తాండవలక్ష్మి ధియేటర్ వద్ద కూల్ డ్రింక్ వ్యాపారం చేసుకునే రామకృష్ణారెడ్డి మంగళవారం బ్యాంకు నుంచి రు.50వేలు డ్రాచేసి తన దుకాణంలో ఉంచాడు. కారులో వచ్చిన ఇరువురు వ్యక్తులు దుకాణంలో నిషేధిత గుట్కాలు అమ్ముతున్నట్లు తమ వద్ద సమాచారం ఉన్నదని, తాము విజిలెన్స్ అధికారులమని, దుకాణం పరిశీలించాలని కోరారు. తాను అలాంటి వ్యాపారం చేయడం లేదని, దుకాణంలో శోధించుకోవచ్చునని రెడ్డి తెలపడంతో ఇరువురిలో ఒకరు దుకాణంలోకి వెళ్ళాడు. రెండో వ్యక్తి రెడ్డిని మాటల్లో పెట్టాడు. తనిఖీ చేసినట్లు నటించిన ఆ వ్యక్తి దుకాణంలో ఉంచిన రు.50వేలు దొంగిలించి, తనిఖీ పూర్తయినట్లు తెలిపి కారులో ఉడాయించారు. తిరిగి దుకాణంలోకి వెళ్ళి చూసిన రెడ్డికి రు.50వేలు కన్పించక పోవడంతో ఆ సొమ్ము చోరీకి గురైనట్లు గుర్తించి, పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు బుధవారం కేసు నమోదు చేసిన ఎస్‌ఐ రాంబాబు దర్యాప్తు చేస్తున్నారు.