మెయిన్ ఫీచర్

రాతియుగం వెనుక .... విజ్ఞాన వీచికల ఆనవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశ్వలాయన మహర్షి: ఈయన ‘అగతత్వాలహరి’ అను గ్రంథమును రచించెను. ఈ గ్రంథమునందు వివిధ రకములైన వ్యవసాయ పద్ధతులు, వృక్ష సంపద గురించి వివరించారు.
అత్రిమహర్షి: ఈయన ‘నామార్థకల్పము’ అనుగ్రంథమును రచించెను. ఈ గ్రంథము నందు 84 లక్షల శక్తులు, వాటి నామములు, నామోత్పత్తులు, నామార్జనములు చెప్పబడ్డాయి.
భోజమహారాజు- ఈయన ‘సమరాంగణ సూత్రధారము’ అను గ్రంథమును రచించెను. ఈ గ్రంథమందు రకముల చిత్రములైన యంత్ర నిర్మాణ విధి విధానములు, ఆ యంత్రములయందు పంచభూత బీజస్థాపన విధులు, విమాన నిర్మాణము, సైరన్లను చేయు పద్ధతి, యుద్ధ తంత్రము, ద్వారరక్షణ, బొమ్మలతో సంగీతము, నాట్యము మొదలగు విషయములు వివరించబడ్డాయి.
సృష్టి, సంస్కృతి అనే రెండు విషయాలు పునరావృత్తమవుతూంటాయి. అంటే అల తరువాత అలలాగా తిరిగి తిరిగి ప్రవర్తిల్లుతుంటాయి. ఇది సనాతన ధర్మంలోని విశ్వాసం. ఇది పాశ్చాత్య తార్కికవాదుల తర్కానికి అతకని, అందని విషయం. కారణం, చరిత్ర గణనకు, ఖగోళ విజ్ఞానాన్ని, పరజ్ఞానాన్ని ప్రాతిపదికగా స్వీకరించడానికి వారు వెనకుడుగు వేస్తారు. వారిది ఎసి, బిసిల కాలగణన. అందుకే మానవ జాతి చరిత్రను, సంస్కృతిని కేవలం వేల సంవత్సరాలకే పరిమితం చేశారు. సనాతన ధర్మంలోని మానవ చరిత్ర సంస్కృతి, కల్పాలకు, మధాన్వంతరాలకు, యుగాలకు విస్తరించినది. అంటే కోట్ల సంవత్సరాలకు చెందింది. దీనిని అంగీకరిస్తే, మానవ సంస్కృతి, విజ్ఞాన వికాసాల అస్తిత్వాన్ని లక్షల, కోట్ల సంవత్సరాలదిగా అంగీకరించవలసి వస్తుంది. అందుకే లోహయుగానికి, రాతియుగానికి వెనుక కూడా మానవ విజ్ఞాన, వికాస చరిత్ర వుందంటే వారికి అంగీకారం కాదు.
ఎప్పుడైనా సత్యానే్వషణలో అభిరుచులకు, అభిప్రాయాలకు, విశ్వాసాలకు తావుండదు. సనాతన ధర్మంలోని సృష్టి, ప్రళయాలు అనేకసార్లు పునరావృత్తమవుతాయని తెలుస్తోంది. ‘యోగవాశిష్ఠం’లో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది.
శ్లో పరమార్దాంబుధౌ స్సారే - రామసర్గతరంగకాః
భూయోభూయోను వర్తంతే - త ఏవానే్వ చభూరిశః
(యోగవాశిష్టం- ముముక్షు ప్రకరణం - సర్గ 2 శ్లో)
వివరణ:రామా! పరమార్థ సత్యమనే సముద్రంలో సృష్టి, ప్రళయాలు ఒకదాని తరువాత మరొకటి అలలవలె వస్తూనే వుంటాయి.
ఈ విషయాలను మేము నమ్మమంటే! నేడు ప్రపంచంలో అనేక దేశాలు ప్రజాధనం రకరకాల అణ్వాయుధాల్ని (బాంబుల్ని) తయారుచేసి గుట్టలు గుట్టలుగా పేర్చుకొని కూర్చున్నాయి. పిచ్చివాడి చేతిలో రాయివలె వుంది పరిస్థితి.
సైన్సు బాగా పెరిగిందంటున్నాము, ఇంకా యింకా పెచ్చు పెరుగుతుంది. కానీ విజ్ఞానం వినాశనానికి దారితీయకూడదు. ‘ఎడ్యుకేషన్ వితౌట్ మోరల్ వాల్యూస్ ఈజ్ డివిలిష్ ఎడ్యుకేషన్’ కాకూడదు. మంచి విలువలను బోధించని విద్య రాక్షస విద్య అవుతుంది. వాతావరణాన్ని, పర్యావరణాన్ని పూర్తిగా పాడుచేస్తున్నాము. జీవరాశి అనేక జాతులు నశించిపోయాయి. ఇలాగే కొనసాగితే ప్రపంచ యుద్ధాలు లేకుండానే మనకు రాతియుగం, లోహయుగం అతి దగ్గరలోనే ఉంటాయి. యుఎన్‌ఓ వారి గ్లోబల్ వార్మింగ్ రిపోర్టు ఈ విషయానే్న చెబుతోంది. నిజాయితీ లోపించిన నేటి విజ్ఞానం యుఎన్‌ఓవారి రిపోర్టును ఏదో ఒక రోజు తప్పక నిజం చేస్తుంది. ఆ దశలో డార్విన్ సిద్ధాంతం మళ్లీ పనిచేస్తుంది. కానీ ప్రకృతి వికాస ప్రకృతి అంతటితో ఆగిపోదు. మళ్లీ మానవ వికాస, విజ్ఞానం, సంస్కృతి కొనసాగుతాయి.
హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసినప్పుడు లక్షలాదిమంది గుట్టలు గుట్టలుగా చనిపోయారు. కాని అక్కడొకరు, అక్కడొకరు ఎలా బ్రతికారో తెలియదు. అదేవిధంగా అవాంతర ప్రళయాలేర్పడినపుడు కూడా రుూ భూమండలం మీద అక్కడక్కడా ఏదో మూల ఉత్తమ మానవులు మిగలవచ్చు. నిలువ నీడ లేక వానరులవలె తిరుగవచ్చు. వాడికి గోళ్ళు, వెంట్రుకలు మొదలగునవి పెరగవచ్చు. అప్పుడు అశరీరులై సూక్ష్మ శరీర ధారులైన మహర్షులు, విశ్వశ్రేయోభిలాషులైన పరమర్షులు, సిద్ధపరుషులు, మానవ విజ్ఞాన, వికాస సంస్కృతీ ప్రవాహాన్ని రాబోయే తరాలకందించడానికి ప్రయత్నిస్తారు. పరమమహర్షులు మిగిలిన మానవజాతిని సంయోజనపరిచి వారి ద్వారా కాలానుగుణమైన పురోగతిని, ఆలోచనలను సమాజానికందిస్తూ మానవ సంస్కృతిని ప్రగతిని కొనసాగిస్తారు.

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590