హైదరాబాద్

అభివృద్ధిలో ఆదర్శంగా జీహెచ్‌ఎంసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: స్థానిక సంస్థల ఆర్థిక పరిపుష్టి, నిధుల సమీకరణ, ఆదాయ పెంపుతో పాటు అభివృద్ధిలో జీహెచ్‌ఎంసీ దేశంలోని ఇతర స్థానిక సంస్థలకు ఆదర్శమని చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషీ అన్నారు. నిధుల సమీకరణకు జీహెచ్‌ఎంసీ చేపట్టిన బాండ్ల జారీ కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రధాన కార్యాలయంలో బాండ్ల లిస్టింగ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎస్ జోషి మాట్లాడుతూ ప్రజలపై ఆర్థికంగా భారం పడకుండా, అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతో ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు జీహెచ్‌ఎంసీ అనుసరిస్తున్న విధానాలు ఇతర సంస్థలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తాయని వివరించారు. దేశంలోని 4041 మున్సిపాల్టీల్లో మెరుగైన పౌర, వౌలిక సదుపాయాల కల్పనకు రూ.39లక్షల కోట్లు అవసరమైనట్లు ఆహ్లూవాలియా కమిటీ పేర్కొందని, ఇంత భారీ స్థాయిలో నిధులను ఏ ప్రభుత్వాలు కూడా సమకూర్చే పరిస్థితి లేనందున అంతర్గత వనరులను రూపొందించుకోవాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో హైదరాబాద్ నగరం రెండో సిటీగా చేరిందని, ఇంతకు ముందు పూణే నగరం కూడా బాండ్లను జారీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. జీహెచ్‌ఎంసీ బాండ్లను జారీ చేయటంలో దేశంలోని పురపాలక విభాగంలో సరికొత్త అధ్యాయనంగా అభివర్ణించారు.
స్వచ్ఛతలో, ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో దేశానికే ఆదర్శంగా నిలిచిన జీహెచ్‌ఎంసీ ఇపుడు బీఎస్‌ఈలో నమోదు కావటం ఒక చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా స్థానిక సంస్థలు సొంతంగా వనరులను సమకూర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. బీఎస్‌ఈలో తొలుత రూ.200 కోట్లకు నమోదు చేయగా, జీహెచ్‌ఎంసీకి ఉన్న మంచి రేటింగ్ కారణంగా రూ.430 కోట్లకు స్పందన వచ్చిందని వివరించారు. మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ స్వయం ఆర్థిక వనరుల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో వౌలిక వసతులను మెరుగుపర్చటం, అవసరాలకు తగిన విధంగా ఎంతో ముందుచూపుతో అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదించిన ఎస్‌ఆర్‌డీపీ కోసం తొలి దశగా రూ. 200కోట్లను ఈ బాండ్ల ద్వారా సేకరిస్తున్నట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం మరో రూ.800 కోట్లను బాండ్ల జారీ ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలిపారు. కేర్ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం జీహెచ్‌ఎంసీకి ఏఏ ప్లస్ ర్యాంకు రావటం, దేశంలోని కేవలం పది నగరాలకు దక్కిన ఈ ర్యాంక్.. జీహెచ్‌ఎంసీకి దక్కటం అధికారులు, సిబ్బంది సమష్టి కృషే కారణమని వ్యాఖ్యానించారు. బాండ్ల లిస్టింగ్‌లో బీఎస్‌ఈ ప్రతినిధులతో కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, నిజామాబాద్ మేయర్ ఆకుల సుజాత, ఖమ్మం మేయర్ పాపాలాల్ పాల్గొన్నారు.