రంగారెడ్డి

ఆధునిక వైద్యమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, ఫిబ్రవరి 22: ప్రజలందరికీ ఆధునిక వైద్యసేవలను ఉచితంగా అందించడమే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అందులో భాగంగానే గాంధీ, ఉస్మానియాతో పాటు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో నెలకొల్పిన ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. గురువారం అమీర్‌పేట పరిధిలో ఎస్‌ఆర్‌నగర్‌లో 30 పడకల సామర్థ్యంతో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిని 50 పడకలకు అప్‌గ్రేడ్ చేసేందుకు మంజూరైన అదనపు పనులకు భూమి పూజ చేశారు. ఐదు సంవత్సరాల క్రితం రూ.2.90కోట్ల నిధులతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి చేపట్టిన పనులు నిధుల కొరతతో నిలిచిపోయినట్లు తెలిపారు. మొదట మంజూరైన నిధులతో గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు భవనము మాత్రమే నిర్మించాలని ఇతర ఫర్నిచరు ఏర్పాటు చేయలేదని అన్నారు. దీనిని దృష్టిలో వుంచుకొని అమీర్‌పేట్‌లోని ప్రజలందరికి మెరుగైన వైద్య సేవలను అందించుటకు మొత్తం 50 పడకల ఆసుపత్రిగా ఆప్ గ్రేడ్ చేస్తూ, అన్ని రకాల వైద్యపరీక్షలు శస్త్ర చికిత్సలు, పరికరాలు, ఫర్నిచరు ఏర్పాటుకై మరో 3కోట్ల 78లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పనులు ఐదోనెలలో పూర్తి చేయించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఎస్.ఆర్‌నగర్ నాలా, శ్మశానవాటిక అభివృద్ధి పనులు చురుకుగా జరుగుతున్నాట్లు ఈ సందర్భంగా తెలిపారు. మల్టీలెవెల్ పార్కింగ్ వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అమీర్‌పేట్ కార్పొరేటర్ శేశుకుమారి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సుజాత, ఆసుపత్రుల వౌలిక వసతుల విభాగం ఈ ఫణి కుమార్ పాల్గొన్నారు.