రంగారెడ్డి

జైళ్ల శాఖలో నూతన సంస్కరణలకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, ఫిబ్రవరి 22: తెలంగాణ జైళ్లశాఖలో నూతన సంస్కరణలకు శ్రీకారం చూడుతున్నామని హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్‌మీట్‌లో పోటీలను ప్రారంభించారు. నాయిని మాట్లాడుతూ జైళ్లలో అధికారులకు, ఖైదీలకు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోపడుతాయని తెలిపారు. ఖైదీల్లో పరివర్తన తీసుకరావడానికి జైళ్లశాఖ ఉపాధి మార్గాలను చూపుతోందని పేర్కొన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారం.. ఖైదీలతో కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసి ఆదాయాన్ని సమాకూర్చుకుంటుందని అభినందించారు. జైల్లో శిక్ష అనుభవించి సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీలతో ఉపాధి కల్పించడానికి నగరంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. కార్యక్రమం లో జైళ్లశాఖ డీజీ విజయకుమార్ సిం గ్, ఐజీ సైదయ్య, జైల్ సూపరింటెండెంట్ ఎంఆర్ భాస్కర్, డిప్యూటీ జైల ర్లు చింతల దశరథ, దేవలా నాయక్, రత్నం, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తేవాలి
కుషాయిగూడ, ఫిబ్రవరి 22: నియంత, దొరల పాలనకు చరమగీతం పాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకరావాలని ఉప్పల్ నియోజకవర్గం ఇన్‌చార్జి బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. సైనిక్‌పురి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ సంబండ వర్గాలు.. దొరల పాలనకు వ్యతిరేకంగా రాజకీయ ఐఖ్యత సాధించాలని సూచించారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ అమల కానీ వాగ్దానలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల కేసీఆర్ దగ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాప్రాకు చెందిన పత్తి కుమార్‌ను కాంగ్రెస్ ఎస్సీ సెల్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా నియమించినట్లు తెలిపారు. కుమార్ మాట్లాడుతూ దళితులకు మూడు ఎకరల భూమి పంపిణీలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే తొలి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాయిజేన్ శేఖర్, కటారి భాస్కర్, మహేష్, సాయిరాం, కృష్ణ, సుజాత, కొత్త అంజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.