రంగారెడ్డి

విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్‌బీనగర్, ఫిబ్రవరి 22 : ప్రపంచంలో ప్రతివ్యక్తీ ఏ రంగంలో రాణించాలన్నా.. దానికి తోడు విద్య అవ సరమని, విద్యతోనే ఉన్నతులుగా ఎదుగుతారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర శాసన సభా స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి పేర్కొన్నారు. అవంతి కళాశాల 26వ వార్షికోత్సవ వేడుకలను కొత్తపేట వైట్ హౌజ్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన వారిద్దరు మంత్రులు అవంతి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్ చైర్మన్, ఎంపీ ఎం.శ్రీనివాసరావుతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విశిష్ట అతిథిగా హాజరైన సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన గీతాలు విద్యార్థుల్లో ఉర్రూతలూగించాయి. వివిధ రంగాలలో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బహుతులు అందజేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ చైర్మన్ ఏ.వెంకటేశ్వర్ రెడ్డి, టెక్ మహీంద్రా అసోసియేట్ మేనేజర్ నిశాంత్ అనురాగ్ దాసరి, అవంతి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ జనరల్ సెక్రటరీ డాక్టర్. ఎం.ప్రియాంక, ఎండీ ఐ.శ్రవణ్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఎంవీఎస్‌ఎస్ నందీష్, డైరెక్టర్ డాక్టర్.వై.జయప్రద, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే.పోచన్న పాల్గొన్నారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం