కృష్ణ

మట్టిలో మాణిక్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఫిబ్రవరి 22: పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న సామెత చందంగా మైలవరానికి చెందిన ఒక బాలిక జాతీయ స్థాయిలో సీఏలో 23వ ర్యాంకు సాధించి అందరి మన్ననలు అందుకుంది. మైలవరానికి చెందిన బొమ్మినీడు రమ్య గత డిసెంబర్‌లో జరిగిన ఐసిడబ్ల్యుఏ(సిఎంఎ) ఫైనల్ ఇంటర్ పరీక్షలలో జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు సాధించింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థిని ఎటువంటి తర్ఫీదు లేకుండా ఒకే సిట్టింగ్‌లో సీఏ ఫైనల్ ఉత్తీర్ణత సాధించటం చాలా అరుదు. చిన్ననాటి నుండి చదువు పట్ల శ్రద్ధ వహించే రమ్య ప్రాధమిక విద్యను శ్రీ లీలావతి ప్రాధమికోన్నత పాఠశాలలో చదివింది. అనంతరం జవహర్ నోదయ విద్యాలయంలో జిల్లా స్థాయిలో ప్రధమురాలిగా నిలిచింది. ఆరో తరగతిలో ప్రవేశం పొంది పదవ తరగతి వరకూ అక్కడే చదివి జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించింది. అనంతరం విజయవాడలోని సిద్ధార్థ మహిళా కళాశాలలో ఇంటర్ ఎంఇసిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయిలో గోల్డ్‌మెడల్ సాధించింది. సీఏపై ఉన్న మక్కువతో సీఏపిటి ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంకు సాధించింది. అదే కోర్సును పూర్తి చేసి సీఏలో తన ప్రతిభను చాటి నేడు జాతీయ స్థాయిలో 23వ ర్యాంకును కైవసం చేసుకుంది. రమ్య తండ్రి శ్రీనివాసరావు మైలవరంలో చిరుద్యోగి. ప్రాధమిక స్థాయిలో తనను ప్రోత్సహించిన శ్రీ లీలావతి ప్రాధమికోన్నత పాఠశాల హెచ్‌ఎం ఉడతా లక్ష్మీనారాయణకు, నవోదయ గురువులకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని రమ్య వెల్లడించింది. తాను ఐఏఎస్ అవ్వాలన్నదే తన ధ్యేయమని వెల్లడించింది. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించిన రమ్యను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అభినందించారు.