కృష్ణ

స్ర్తి నిధిలో మనమే ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, ఫిబ్రవరి 22: స్ర్తి నిధి, బ్యాంక్ లింకేజ్‌ల్లో రాష్ట్రంలో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం చెప్పారు. లబ్ధిదారులకు రుణాల మంజూరులో ప్రతిభ కనబర్చిన గ్రామీణాభివృద్ధి శాఖాధికారులను ఉగాది రోజున బంగారు పతకాలతో సత్కరిస్తామని ఆయన చెప్పారు. గురువారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం కమిటీ హాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అమలు జరుగుతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల వివరాలను కంప్యూటరీకరించాలన్నారు. సదాసేవ అంశంపై సమీక్షిస్తూ జిల్లాలో జన్మభూమి-మా ఊరు, మీకోసంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరించి లబ్ధిదారులకు ఆయా సమాచారాన్ని అందజేయాలన్నారు. మీ కోసంలో అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించుకుంటే సంబంధిత అధికారులను అపరాధ రుసుం విధిస్తామన్నారు. లబ్ధిదారులను సంతృప్తిపర్చే విధంగా ఆయాశాఖల అధికారులు కృషి చేయాలన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని గ్రామాలు, పట్టణాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. చెరువుల్లో నీటిని నింపడం, బోర్లు, బావుల మరమ్మతులు తక్షణమే చేపట్టాలన్నారు. జిల్లాలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ వైద్యసేవ తదితర పథకాలను మరింత మెరుగుపర్చాలన్నారు. జలసంరక్షణలో భాగంగా జిల్లాలో నీరు-చెట్టు పథకం కింద 116రోజుల పాటు కార్యక్రమాలను చేపట్టామన్నారు. జిల్లాలో నీరు-చెట్టు కింద డ్రైన్లు, పూడికతీత పనులు, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల్లో ఉపాధి కూలీలు పనిచేసేలా జిల్లాలో మార్చి 1వ తేదీ నాటికి లక్ష మంది ఉపాధి కూలీలకు పని దొరికేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అవనిగడ్డ, కోడూరు తీరప్రాంతాల్లో రెండవ పంటగా వేసిన మినుము, పెసలు ఎండిపోకుండా మండల ప్రత్యేక అధికారులు అందుబాటులో ఉన్న నీటిని రెయిన్ గన్‌ల ద్వారా పొలాలకు అందించి పంటలను కాపాడాలన్నారు. జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా పంటలు ఎండిపోయాయని రైతులు చెబితే ఆయా మండలాల ప్రత్యేక అధికారులదే బాధ్యతగా భావించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో అతి తీవ్ర పోషక లోపం ఉన్న పిల్లలతో పాటు మధ్యస్థ పోషక లోపం ఉన్న పిల్లలు కేవలం 11,223మంది ఉన్నారని, వీరికి కావాల్సిన అన్నిరకాల పోషక పదార్థాలను అందజేయాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా శిశు సంక్షేమ, మహిళాభివృద్ధిశాఖలో బయోమెట్రిక్ నమోదులో నూరుశాతం హాజరు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, డీఆర్వో అంబేద్కర్, ఆర్డీవోలు ఎం చక్రపాణి, సీహెచ్ రంగయ్య, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ సత్యనారాయణ, బీసీ కార్పోరేషన్ ఈడీ పెంటోజిరావు, డీఎస్‌వో బెనర్జీ, డీఈవో రాజ్యలక్ష్మి, ఐసీఎస్ పీడీ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.