కృష్ణ

నీరిస్తేనే వెళతాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఫిబ్రవరి 22: సాగునీటి కోసం నియోజకవర్గ రైతులు కదం తొక్కుతున్నారు. ఆరుతడి పంటలు వేసుకోవాలని పాలకులు, అధికారుల ప్రచారాలను నమ్మి నిండా మునిగిపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరి దశలో సాగునీరు ఎందుకు సరఫరా చేయటం లేదని నిలదీస్తున్నారు. జిల్లా మంత్రులు, అధికారుల అసమర్ధత వల్లే దివిసీమకు సాగునీరు రావటం లేదని మండిపడుతున్నారు. తక్షణమే సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సాగు చేసిన మొక్కజొన్నకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. రైతుల ఆందోళన తీవ్రరూపం దాలుస్తోంది. గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. సాగునీరు విడుదల చేసే వరకు కదలమని భీష్మించుకుని కుర్చున్నారు. తహశీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ ఉదయ భాస్కరరావు సాగునీటిపై రైతులతో చర్చించారు. పులిగడ్డ, మోపిదేవి వార్పు ప్రాంతంలో ప్రధాన పంట కాలువ పక్కన ఉన్న బోర్ల ద్వారా సాగునీరు అందించే ఏర్పాటు చేస్తామని చెప్పగా దాని వల్ల రైతుల మధ్య గొడవలు తప్ప ప్రయోజనం ఉండదని రైతులు తేల్చిచెప్పారు. పంట కాలువ ద్వారానే సాగునీరు విడుదల చేయాలని స్పష్టం చేశారు. పంట కాలువకు సాగునీరు వదిలే వరకు ఆందోళన విరమించమని ప్రకటించారు. అనంతరం రిలే నిరాహార దీక్షలను కూడా తాలూకా కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ ఆందోళనలో వైకాపా నాయకుడు గుడివాక శివరావు, రైతు విభాగం నాయకుడు బీసాబత్తిన ప్రసాద్, బీజెపీ నేత గుడివాక అంజిబాబు, జివి నగరాయులు, భోగాది చంద్రశేఖర్, జనసేన నాయకుడు రాయపూడి వేణుగోపాలరావు, వేకనూరు, తుంగలవారిపాలెం, గుడివాకవారిపాలెం, బందలాయిచెరువు, అవనిగడ్డకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైకాపా నేత సింహాద్రి రమేష్‌బాబు రైతులకు మద్దతు తెలిపారు.