అదిలాబాద్

స్వయం తప్పిదాల వల్లనే ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, జనవరి 21: స్వయం తప్పిదాల వల్లనే రోడ్ల ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు యువత ముందుకు రావాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ అన్నారు. 20వ రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా రవాణా శాఖ, ఐటిడిఏ సంయుక్తంగా గురువారం అవగాహన ర్యాలీ, సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఐటిడిఏ నుండి కొమరంభీం ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పివోతో పాటు ఇంచార్జి ఆర్‌టివో వివేకానందరెడ్డితో కలిసి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మద్యపానం సేవించి వాహనాలు నడపడం, మితిమీరిన వేగంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు.
వీటన్నింటిపై అవగాహన యువత కల్పించుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. బస్సులో, ఆటోలు ఎదైన వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. యువతి యువకులు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్‌ను వాడాలని, మిగితవారు హెల్మెట్ వాడేలా అవగాహన కల్పించాలన్నారు. రవాణా శాఖ వారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు ఆర్‌టి ఏ వారి సలహాలు, సూచనలు పాటించినట్లయితే ప్రమాదాలను ఎంతో కొంత నివారించవచ్చని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి రవాణా శాఖ ద్వారా తప్పనిసరిగా ప్రమాద మంత్రి బీమా యోజన పథకం ద్వారా రూ.12 చెల్లించినట్లయితే ప్రమాద బీమా రూ.2లక్షల వరకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అనంతరం రవాణా శాఖకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు డిఎస్పీ మల్లారెడ్డి, రవాణా శాఖ ఏవిఏంలు శ్రీనివాస్ రెడ్డి, కిషన్ చంద్రరెడ్డి, ఉట్నూరు సిఐ బిఎల్‌ఎన్ స్వామి, ఉట్నూరు సర్పంచ్ బొంత ఆశారెడ్డి తదితరులు పాల్గొన్నారు.