రుచి

ఫలాలతో ఆరోగ్యఫలం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటిల్లిపాది ఆరోగ్య రక్షణ ఆడవారిదే. ఇంట్లో ఎవరెవరు ఏమేమి తింటారో వారికి అనారోగ్యం కలుగకుండా ఉండాలంటే ఏమేమి చేయాలో కూడా ఎక్కువ స్ర్తిలే ఆలోచిస్తుంటారు. ఇటీవలి కాలంలో అర్గానిక్ పుడ్ తీసుకోవాలంటే అర్గానిక్ దినుసులు అమ్మేవారు ఎక్కువయ్యారు. అన్ని చోట్ల కల్తీలే ఎక్కువగా ఉంటున్నాయి. పొద్దునలేచినప్పటి నుంచి నిదురపోయేవరకు అన్ని వయస్సుల వారికీ అలసటలు, అపసోపాలు తప్పడంలేదు. నాలుగు ఫర్లాంగుల దూరం నడవాలంటే నా వల్ల కాదు అనేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. మార్నింగ్ వాకింగ్ కొందరు చేస్తున్నాం అంటారు. కొందరు టైము లేదు మాకు అంటారు. కాని ఏదో ఒకటి తినేసి రోజు గడిపేవారు ఎక్కువే ఉంటున్నారీ మధ్య. అందుకే టైము లేక సరిగా తినని వాళ్లు, వ్యాయామాలు సరిగా చేయనివారు, పిన్నలైనా పెద్దలైనా ఫలాలుతింటేవారి ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్ శరీరానికి అందుతాయి. పైగా వారికి బిపీలు, షుగర్స్ లాంటి జబ్బుల గోల దగ్గరకు రాదు. కనుక అందరూ ఇష్టంగా తినగలిగేది కూడాపండ్లే. నిద్రలేమి, ఊబకాయం, కంటివ్యాధులు, రక్తహీనత, కీళ్లనొప్పులతో సతమతమయ్యేవారు క్రమపద్ధతిలో వీటిని తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. డ్రైప్రూట్స్ తింటే ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం.
ఖర్జూరం:ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచేందుకు దోహదపడుతుంది. రక్తం శుద్ధిచేసేందుకు ఖర్జూరం ఉపయోగపడుతుంది. పీచుతో కూడిన పండు కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
జీడిపప్పు:దీనిలో కాల్షియం పోషక పదార్థాల శాతం ఎక్కువ. దీనిని సరైన మోతాదులో తింటే ఆరోగ్యానికి శ్రేయస్కరం. అతిగా తింటే అనారోగ్యమూ కలుగవచ్చు. ఎక్కువగా తినకూడదు.
బాదం:కాల్షియం, ఐరన్ ఉంటాయి. చిన్న పిల్లలకు తగిన మోతాదులో తినిపిస్తే మంచిది. వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
పిస్తా:పీచుపాళ్ళు ఎక్కువ. పోషక పదార్థాలు కూడా అధికంగానే వుంటాయి. రక్తనాళాలను శుద్ధి చేస్తుంది.
ఎండుద్రాక్ష:దీనిలో ఐరన్ శాతం ఎక్కువ. రక్తహీనతను అరికడుతుంది. మహిళలు ఆరోగ్యవంతంగా వుండేందుకు ఇది దోహదపడుతుంది.
వాల్‌నట్‌లు:శరీరానికి వేగంగా శక్తినిచ్చేందుకు వాల్‌నట్‌లు ఉపయోగపడతాయి. ఇవి ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. గుండె పనితీరును క్రమబద్ధీకరించేందుకు, అధిక బరువును తగ్గించేందుకు తోడ్పడతాయి.
అంజురా:చాలా పోషకాలు ఉంటాయి. విటమిన్ల శాతం ఎక్కువ. ఇది శక్తిని సమకూర్చేందుకు దోహదపడతాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారికి వీటిని ఇవ్వడం వారిలో అనారోగ్యలక్షణాలు తొందరగా రావు.

- హనుమాయమ్మ