హైదరాబాద్

ఆన్‌లైన్ గోల్డ్ చీటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఆన్‌లైన్‌లో బంగారం విక్రయిస్తామంటూ మోసం చేసే గ్యాంగ్‌ను కాచిగూడ పోలీసులు అరెస్డు చేశారు. ఇందుకు సంబంధించి ఎసిపి జె.నర్సయ్య శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పంకజ్‌కుమార్ అగర్వాల్, భాయ్ లాల్ భాయ్, మెహుల్ కుమార్ పటేల్‌ను అరెస్టు చేసి రూ.10 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిజమైన బంగారు బిస్కెట్లు ఆన్‌లైన్‌లో చూపించి, నగదు స్వీకరించిన తర్వాత వారికి నకిలీ బంగారు బిస్కెట్లను పంపించి అమాయకులను మోసం చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పంకజ్‌కుమార్ ఒడిస్సాకు చెందిన వాడు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం తన స్నేహితులు కొందరితో కలిసి గుజరాత్‌లో ఆన్‌లైన్ గోల్డ్ వ్యాపారం అంటూ ప్రారంభించారు. అహ్మదాబాద్, నాగపూర్, బెంగళూరు, పూనే, ప్రస్తుతం భువనేశ్వర్‌లో ఉంటూ ఇలా అక్రమాలకు పాల్పడే వాడు. ఇతనికి ఈ కేసులో రెండు, మూడవ నిందితులతో ఫేస్‌బుక్ ద్వారా ఆన్‌లైన్ గోల్డ్ వ్యాపారం చేస్తున్నట్లు పరిచయం ఏర్పడింది. గుజరాత్‌లోని భుజ్ ప్రాంతంలో ఈ ముగ్గురు కలుసుకున్నారు. అమాయకులైన వారికి నకిలీ బంగారు బిస్కెట్లు అంటకట్టి అక్రమంగా సంపాదించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ అక్రమ సంపాదనలో రెండు, మూడవ నిందితులు ఇద్దరికి 20 శాతం కమిషన్ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. మార్కెట్ ధర కన్నా ఆరు శాతం తక్కువ ధరకు ఆన్‌లైన్‌లో బంగారం విక్రయిస్తామంటూ ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన మహదేవ్ అనే వ్యక్తి పంకజ్‌తో ఫోన్‌లో సంప్రదించాడు. అంతర్జాతీయ స్ధాయిలో బంగారం, వజ్రాల వ్యాపారం చేస్తున్నట్లు మహదేవ్‌ను నమ్మబలికాడు. ఇదంతా నమ్మిన ఫిర్యాది గుజరాత్‌లోని భుజ్ నగరానికి వచ్చి నిందితులను కలిశాడు. అతనికి నిజమైన బంగారు బిస్కెట్లు చూపించి నమ్మకం కలిగించారు. హైదరాబాద్‌లో ఉన్న తమ వాళ్లు అంటే నాలుగో నిందితుడు భాయ్ లాల్, ఐదవ నిందితుడు మెహుల్ కుమార్ పటేల్ బంగారం అక్కడే మీకు అందజేస్తారని చెప్పారు. ఈ ప్రకారం ఫిర్యాది మహదేవ్ రెండు దఫాలుగా హైదరాబాద్‌లోని కాచిగూడ ప్రాంతంలో ఉండే భాయ్ లాల్, మెహుల్ కుమార్‌లకు రూ.30 లక్షలు చెల్లించాడు. డబ్బు చెల్లించిన తర్వాత బంగారం ఇవ్వలేదు. ఫోన్లు చేస్తున్నా అవతలి వైపు నుంచి స్పందన లేదు. దీంతో తాను మోసపోయినట్లు భావించి కాచిగూడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం విచారణ చేపట్టిన కాచిగూడ పోలీసులు ఒడిస్సాలో పంకజ్‌కుమార్‌ను, హైదరాబాద్‌లో భాయ్‌లాల్, మెహుల్ కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో రెండు, మూడవ నిందితులు పరారీలో ఉన్నారు. నగర తూర్పు మండల డిసిపి సి.శశిధర్‌రాజు పర్యవేక్షణలో ఎసిపి జె.నర్సయ్య, ఇన్‌స్పెక్టర్ కె.సత్యనారాయణ, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సి.యాదేందర్‌లు ఈ కేసును చేధించి నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.10 లక్షల నగదు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.