హైదరాబాద్

రూ.10లక్షల రుణంపై వడ్డి చెల్లింపుకు సింగరేణి బోర్డు ఆమోథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: దేశంలోనే ఏ సంస్థలోనూ లేని విధంగా సింగరేణి కాలరీస్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల స్వంత ఇంటి కలను సాకారం చేసే పధకానికి బోర్డు ఆమోదం తెలిపింది. రూ.10లక్షల వరకు బ్యాంకుల నుంచి పొందే రుణంపై వడ్డీని ఇక సంస్థ కార్మికులకు చెల్లించనుంది. శుక్రవారం సింగరేణి భవన్‌లో జరిగిన బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించిన బోర్డు ఆఫ్ డైరెక్టర్లు పధకం అమలుకు రూపొందించిన విధివిధానాలకు అంగీకారం తెలిపారు. దీనికి సంబందించిన సర్క్యులర్‌ను వెంటనే జారీ చేయనున్నట్టు సంస్థ సిఎండి శ్రీ్ధర్ ప్రకటించారు. దీని ప్రకారం సింగరేణి కార్మికుడు స్వంత ఇంటి కోసం బ్యాంకు ద్వారా తీసుకునే రుణానికి సంబందించిన వడ్డీ సొమ్మును యాజమాన్యం తిరిగి కార్మికునికి చెల్లిస్తుంది. ఇప్పటికే రుణం పొందిన వారికి కూడా ఈ సౌకర్యాన్ని వర్తింప చేయాలని నిర్ణయించింది. గతంలో రుణం పొందిన వారు అందుకు సంబందించిన పత్రాలను యాజమాన్యానికి అందజేసి లబ్దిపొందవచ్చు. ఒక కార్మికుడు ఇంటి నిర్మాణం కోసం ఎంతైనా రుణం పొందవచ్చు, అయితే రూ.10లక్షల వరకు మాత్రమే సంస్థ వడ్డీని చెల్లిస్తుంది. అధికంగా పొందిన రుణానికి సంబందించిన వడ్డీని కార్మికుడే భరించాల్సి ఉంటుంది. ఇందు కోసం ఏడాదికి సుమారు రూ.130 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని సింగరేణి ఆర్థిక శాఖ అంచనాలు వేసింది. సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈ పధకాన్ని రూపొందించినట్టు, ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సిఎండి శ్రీ్ధర్ పిలుపు నిచ్చారు. దీంతో పాటు కార్మికుల కోసం పలు సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. కార్మికుల తల్లిదండ్రులకు సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందించడం, మెడికల్ అన్‌ఫిట్ కేసుల్లో ఉద్యోగం వద్దనుకునే కార్మికులకు ఒకే సారి రూ.25 లక్షలు చెల్లించడం లేదా నెలకు రూ.25వేలు చెల్లించాలని డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. సీఎండి శ్రీ్ధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బొగ్గు మంత్రిత్వ శాఖ డైరెక్టర్లు జె ఎస్ బింద్ర, సరుూద్ అస్రఫ్, రాష్ట్ర ప్రబ్తువ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రామకృష్ణారావులతో పాటు సింగరేణి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.