క్రీడాభూమి

ఓడిఐ బౌలింగ్ టాప్‌లో రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: వనే్డ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో టాప్ ర్యాంక్ యంగెస్ట్ బౌలర్‌గా ఆఫ్గానిస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల రషీద్ ఖాన్ అర్మాన్‌తో పాటు భారత్‌కు చెందిన జస్ప్రీత్ సింగ్ బుమ్రా నిలిచారు.
రషీద్ ఖాన్‌గా పిలువబడే ఆఫ్గాన్ కుర్రాడు గత కొన్ని సంవత్సరాల నుండి వివిధ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్‌లతో పాటు ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) వంటి మేజర్ టోర్నమెంట్‌లో రాణించాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌తో భారత్‌కు చెందిన జస్ప్రీత్ సింగ్ బుమ్రా సంయుక్తంగా టాప్‌లో నిలిచారు. రషీద్ ఐపీఎల్, బీబీఎల్ లీగ్‌లో తన పదునైన బౌలింగ్‌తో ఫ్రాంచైజీలను ఆకట్టుకున్నాడు.
అగ్రస్థానంలో పాక్
ౄ టీ-20 ర్యాంకింగ్స్‌లో తప్పు దొర్లింది:ఐసీసీ
వెల్లింగ్టన్, ఫిబ్రవరి 23: ఇటీవల టీ-20 ర్యాంకింగ్స్ విడుదల చేసే క్రమంలో ముందుగా రాతపూర్వక తప్పిదం జరిగినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వెల్లడించింది. టీ-20 ర్యాంకింగ్స్‌లో భాగంగా ఐసీసీ అధికారి ప్రతినిధి ఒకరు రాతపూర్వక తప్పిదం చేసినట్లుపేర్కొంది. గతవారం ఐసీసీ ప్రతినిధి టీ-20 ర్యాంకింగ్స్ గురించి క్రికెట్ డాట్ కామ్ ఏయూకి వివరాలు వెల్లడిస్తూ ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌తో జరిగిన ముక్కోణపు టీ-20 సిరీస్‌లో ఆస్ట్రేలియా చివరి వరకూ ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఉంటే ఆ జట్టు కొత్తగా వరల్డ్ నెంబర్ వన్‌గా అవతరిస్తుందని ప్రకటించారు.
కాగా, ఇక్కడ ఆసీస్ ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీ సాధించినా రెండో స్థానానికే పరిమితమైంది. అయితే దీనిపై ఐసీసీ వివరణ ఇస్తూ.. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పాకిస్తానే టాప్ ర్యాంక్‌లో ఉన్నట్లు తెలిపింది. ఇక్కడ ఆస్ట్రేలియా 125.65 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 125.84 పాయింట్లతో ఆగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నట్లు పేర్కొంది. అయితే ఇక్కడ రెండు జట్లు దాదాపు 126 పాయింట్లు సాధించినప్పటికీ 0.19 తేడాతో పాకిస్తాన్ ఆగ్రస్థానంలో నిలిచిందని ఐసీసీ వెబ్‌సైట్‌లో వివరణ ఇచ్చింది. అదొక రాతపూర్వక తప్పిదంగా పేర్కొంది.
కపిల్‌తో పాండ్యకు పోలికా?
ౄ శివాలెత్తిన భారత మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: దక్షిణాఫ్రికాపై భారత ఘోర పరాజయం అనే రకాలుగా అంతర్మథనానికి దారితీస్తోంది. ముఖ్యంగా కపిల్‌దేవ్‌తో హార్థిక్ పాండ్యను పోల్చడంపై రోజర్ బిన్నీ శివాలెత్తాడు. ఏకోశానా వీరిద్దరి మధ్య పోలికే లేదని పేర్కొన్న రోజర్ బిన్నీ ‘హార్థిక్ పాండ్య ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందడం అన్న అతని అదృష్టం’ అని పేర్కొన్నాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో జరిగిన మ్యాచ్ సిరీస్‌లలో పాండ్య ఘోర పరాజయాన్ని కనబరచడాన్ని ప్రస్తావించిన రోజన్ బిన్నీ ‘ఇటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ పాండ్య విఫలమయ్యాడు’ అని వ్యాఖ్యానించాడు.
కేప్‌టౌన్‌లో జరిగిన టెస్ట్‌మ్యాచ్‌లో పాండ్య ఆటతీరును కూడా విమర్శించాడు. కేప్‌టౌన్‌లో జరిగిన టెస్ట్‌లో పాండ్య చేసిన స్కోరు కేవలం 1, 15, 6, 0, అని ఆయన వ్యాఖ్యానించాడు. అయితే, పాండ్య కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసుకున్నాడని, అయినా, భారత్ 5-1 తేడాతో ఐదు వనే్డల సిరీస్‌ను కైవసం చేసుకుందని ఆయన గుర్తు చేశాడు. ఇందులో పాండ్య ఘనత గొప్పగా ఏమీ లేదని, అందరి దృష్టిలో ఆల్‌రౌండర్‌గా ముద్రపడినా, బ్యాటింగ్‌ను సరిగా ఝలిపించలేకపోయాడని ఆయన అన్నాడు.
బోపన్న, శరణ్ పరాజయం
ౄ ఏటీపీ వరల్డ్ టూర్ ఈవెంట్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: భారత టెన్నిస్ ఆటగాళ్లు రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ ఇక్కడ జరుగుతున్న ఏటీపీ వరల్డ్ టూర్ ఈవెంట్‌లో ఓటమిని చవిచూశారు. రెండో సీడ్ ఆటగాడిగా ఎడ్వర్డ్ రోజర్ వేజలైన్ కలసి ఆడిన ఫైనల్‌లో 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 1-6, 4-6 తేడాతో నాలుగో సీడ్ ఆటగాళ్లు మెర్క్యూస్ డేనియల్, డోమినిక్ ఇన్‌గ్లాట్ చేతిలో పరాజయం పాలయ్యారు.
మరో మ్యాచ్‌లో భారత్‌కు చెందిన దివిజ్ శరణ్, స్కాట్ లిప్‌స్కీ 6-3, 3-6, 5-10 తేడాతో మూడో సీడ్ బెన్ మెక్‌లచియాన్, హ్యూగో నైస్ చేతిలో ఓడిపోయారు. భారత్‌కు చెందిన లియాండర్ పేస్, దివిజ్ శరణ్ ప్రారంభ మ్యాచ్ తొలిరౌండ్‌లోనే కోల్పోయిన విషయం తెలిసిందే.

క్రికెట్ కెనడా టీ-20 లీగ్‌కు
ఐసీసీ ఆమోదం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ టీ-20 క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు అన్ని దేశాలు మందుకు వస్తున్నాయి. ఒక పక్కన టీ-20 నిర్వహించవద్దని ఆరోపణలు వస్తున్న వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా అనేక దేశాలు యువ క్రికెటర్‌లను ఉత్సాహపరిచేందుకుగాను టీ-20 టోర్నీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ కోణంలో తాజాగా గ్లోబల్ టీ-20 కెనడా క్రికెట్ లీగ్‌ను నిర్వహిస్తోంది. జూలైలో జరుగునున్న ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతి జట్టులో నలుగురు చొప్పున కెనడాకు చెందిన ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.
టోర్నమెంట్‌లో పాకిస్తాన్, వెస్టిండీస్, న్యూజీలాండ్‌కు చెందిన ఆటగాళ్లు కూడా పాల్గొంటారని తెలిపారు. మేటి అటగాళ్లు టోర్నీలో ఆడేవిధంగా చర్యలు తీసుకునేందుగా హైలెవెల్ అడ్వయిజరీ బోర్డును ఏర్పాటు చేసింది. టోర్నమెంట్‌లో ప్రముఖ మాజీ క్రికెటర్లయిన బ్రెండాన్ మ్యాక్‌లామ్, కిరోన్ పాలార్డ్, డ్వానేబ్రేవోతో పాటు పలువురు క్రికెటర్‌లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మెర్క్యురీ గ్రూప్, క్రికెట్ కెనడా టీ-20 టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది. క్రికెట్ కెనడా ప్రెసిడెంట్ రంజిత్ సైనీ మాట్లాడుతూ టీ-20 మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు కెనడాలో అపూర్వ స్పందన లభిస్తోంన్నారు.
కెనడాలో క్రికెట్ పట్ల మక్కువ పెరిగేందుకు, టీ-20 లీగ్ టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు మెర్క్యురీ గ్రూప్ సిఈఓ, వ్యవస్థాపకులు శ్రీరామ్ భక్తిశరన్ తెలిపారు.