Others

అమ్మరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అ అంటే అమ్మే
చింపిరి తల
చిరిగిన బట్టలు
చావిట్లో విరిగిన నులక మంచం
ఏ గుడిసె చూసినా
ఏముంది గర్వకారణం?
ఎండిన డొక్కల్లో పొడి పొడిగా
రాలిపడే ఆకలి రజను తప్ప

అవిశ్రాంత జీవన సమరంలో
భరించలేని నిస్సత్తువుని
భవిష్యత్తుకు తాకట్టు పెట్టి
అంతే అలవాటుగా
శరీరాన్ని మూటకట్టుకుని
దొరగారి చేలచాళ్లల్లో
దేహాన్ని దున్నించుకుని
పలుగూ పారా పోట్లతో
మనసుకి పడ్డ గాట్లతో
పొద్దు పుల్లల్ని విరిచి
చీకటి తాళ్లతో బిగించి
తరలి వచ్చే అడవి మందారం మా అమ్మ

చుట్టూ మొసళ్ల గుంపులు
ఆపై నక్కల పలకరింపులు
చిరిగిన చీరెకు విశ్వరహస్యపు మాసికల్లో
అమ్మతనం నింపుకుని
చెరగనీ చిరునవ్వుతో ఆత్మవిశ్వాసాన్ని
తొడుక్కునే అమ్మని చూస్తుంటే
జీవితం చిమ్ముకొస్తున్నట్లు
చెమ్మచెమ్మగా ప్రవహించటం కనిపిస్తుంది
ఆకలేస్తే సంకటిగా దాహమేస్తే నదిగా
మారే అమ్మంటే

ఒక నమ్మకం ఒక ధైర్యం
అమ్మంటే ఒక బతుకు పటం
అమ్మంటే వెలిగించిన దీపం

-లాస్య ప్రియ కుప్పా 9640551664