డైలీ సీరియల్

యాజ్ఞసేని 46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి ఏనుగులు, గోవులు, ఒంటెలు, ఎద్దులు, గాడిదలు, మేకలు మొదలైన పశుసంపదలతో నగరం సమృద్ధిగా నిండినది.
తియ్యమామిడి, కదంబం, అశోకం, చంపకం, పున్నాగం, నాగపుష్పం, లకుచం, మొదలగు పుష్ప జాతులతో నగరం సుగంధమయమైంది.
పనస, మద్ది, తాడి, చీకటి చెట్లు, పొగడ చెట్లు, మొగలి పొదలు, మొదలైన వృక్ష పుష్ప జాతులతో నగరము చూడముచ్చటగా చేయబడినది.
పెద్ద ఉసిరి, లొద్దుగు, నేరేడు, పాటలం, కుంబకం, అతిముక్తికం, అతిముక్తకం, కరవీరం, అంకోలం, పారిజాతము మొదలైన చెట్లతోనూ, అన్ని కాలాలలోనూ పుష్పించి ఫలాలుగల చెట్లతో, పక్షుల కిలకిలాధ్వనులతో, మయూర కేకారాలతో, మదించిన కోకిలలతో, స్వశ్చగృహాలతో, క్రీడాలతాగృహాలతో ఉద్యానవనాలు నిర్మింపబడ్డాయి.
హంసలు, కరండవాలు, చక్రవాకాలతో ప్రకాశించే సరస్సులు అన్నివైపులా వ్యాపించి ఉన్నాయి. సుందర విశాలమైన పెద్ద పెద్ద చెరువులు వ్యాపించి వున్నాయి.
పిమ్మట-
మయుడు (విశ్వకర్మ) శ్రీకృష్ణుని ఆజ్ఞానసారం ‘బిందుసరసం’ వద్ద పదునాలుగు నెలలు పరిశ్రమించి ఒక ‘సభాభవనాన్ని’ నిర్మించాడు. ఆ సభా భవనం మణిమయాలైన రూపాలతో, స్తంభాలతో, గోడలతో, అరుగులతో, రాతి కట్టడ ప్రదేశాలతో, ప్రహరీ గోడలతో, ఇంద్రనీలమణుల కిరణాలనే నీళ్ళతో, పద్మరాగమణులతో చెక్కిన ఎఱ్ఱని పద్మాలతో, వెండితో చేసిన తెల్లని తామరలతో, రాజహంసలతో, మేలిమి బంగారు పోత పోసిన తాబేళ్ళతో, వైఢూర్యాలతో మలచిన కలువలతో, వజ్రాలతో చేసిన చేపలతో, ముత్యాలతో కల్పించిన కొంగ్రొత్త మణులతో, మరకతాలతో రూపొందించిన నాచులతో, ప్రకాశించే మణిమయ ప్రదేశములు చూచి అవి మడుగుని, స్ఫటికరాళ్ళ గోడల కాంతులు కప్పటం చేత నీళ్ళుండే చోట్లను నీళ్ళు లేవని భ్రమపడేటట్లుగా నిర్మింపబడింది.
ఆ సభా భవనంలో మనోహరాలైన యంత్రాలు అమర్చబడి వున్నాయి. ఎప్పుడూ పూలతో పండ్లతో కనువిందు చేసే చెట్ల తోపులతోనూ, పూచిన తామరలతో, విచ్చిన కలువలతో కళకళలాడే కొలనులూ, వ్రేలాడే రకరకాల పతాక తోరణాలతో కూడిన గువ్వల గూళ్ళున్న ప్రదేశాలూ రూపొందించబడిన కల్పింపబడిన గొప్ప సభ ఏర్పాటుచేయబడినది.
పదివేల మూరల చుట్టుకొలతతో, సూర్యకిరణ ప్రసారంతో వైభవోపేతమైన వివిధ ధర్మకాంతులతో విశేషంగా శోభిల్లే సభా భవనాన్ని మయుడు నిర్మించాడు.
ఆ సభాభవనాన్ని అమిత వేగంగల, అత్యధిక బలంతో ఆకాశంలో సంచరించే ఎనిమిదివేల మంది రాక్షసభటులతో మోయించి ‘ఇంద్రప్రస్తానికి’ తెచ్చి ధర్మరాజు సమర్పించాడు.
అటుల నిర్మితమైన ఆ గొప్ప నగరంలో పౌరవ వంశీయుడు, మంగళ సత్కారాలు పొందిన యుధిష్ఠిరుడు వేదవేత్తలైన బ్రాహ్మణులతో, సోదరులతో కలిసి శ్రీకృష్ణుడు, ధౌమ్యుడు, వేదవ్యాసుడు మొదలైనవారు వెంటరాగా, వారి అంగీకారంతో ముప్పది రెండు ద్వారాలుగల ‘వర్థమాన’మను పేర ప్రసిద్ధి పొందిన నగర ద్వారం నుండి లోనికి ప్రవేశించాడు. అదే సమయంలో శంఖ దుందుభి నాదాలు ఒక్కసారిగా మార్మ్రోగాయి. బ్రాహ్మణుల జయజయ శబ్దాలు వ్యాపించాయి. వంది, మాగధ, సూతులు, మునులు స్తోత్రాలు చేశారు.
యుధిష్ఠిరుడు పట్ట్భాషిక్తుడయ్యడు. ఏనుగును అధిరోసించాడు రాజమార్గాన్ని దాటి పవిత్ర శ్రేష్ఠ భవనాన్ని యుధిష్ఠిరుడు ప్రవేశించాడు.
యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని, వేదవ్యాసుని, విప్రులని యధావిధిగా పూజించాడు. తదుపరి విశ్వకర్మను పూజించి వీడ్కోలు పలికాడు.
శ్రీకృష్ణద్వైపాయనుని పూజించి వీడ్కోలు పలికాడు.
శ్రీకృష్ణుడు తిరిగి వెళ్ళటానికి సిద్ధపడగా యుధిష్ఠిరుడు-
పుణ్యాత్మా! యదునందనా! నీ అనుగ్రహంవలన, నీ దయతో నేను రాజ్యాన్ని పొందగలిగాను. నీ దయవలననే దుర్గమం, నిర్జనం అయిన ఈ ప్రదేశం నేడు ధనధాన్య సమృద్ధిని పొందింది. నీ కరుణా కటాక్షంవలననే మేము సింహాసనాన్ని అధిరోహించగలిగాము. మాధవా! నీవే మాకు చివరి దిక్కు. నీవే మాకు తల్లివి, తండ్రివి, బంధుడవు, సచివుడవు, స్నేహితుడవు. మేము పాండు మహీపతిని ఎరుగము. మేము చేయవలసిన పనులన్నియు నీవే మాచేత చేయించుము. మేము చేయవలసిన కార్యనిర్వహణకు అనుమతినిమ్ము’’ అని చేతులు జోడించి అన్నాడు.

- ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము