రాష్ట్రీయం

శంకుస్థాపన వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం భవనాల నిర్మాణానికి సంబంధించి రేటు కుదరకపోవడంతో శుక్రవారం సిఎం చంద్రబాబు వేయాల్సిన ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమం వాయదాపడింది. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రెండు మూడు రోజుల్లో టెండర్లు ఖరారు చేస్తామని మున్సిపల్ వ్యవహారాల ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. టెండర్లు వేసిన సంస్థలతో చర్చలు త్వరగా ముగించాలని చూస్తున్నామని, ప్రక్రియ రెండు లేదా మూడు రోజుల్లో పూర్తవుతందన్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టికి అప్పగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎల్ అండ్ టి నిర్ణీత గడువులోగా భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసిన చరిత్ర కలిగి ఉండటంతో పాటు రేటు విషయంలో పట్టువిడుపులకు పోకుండా ఏదోక రేటుకు అంగీకరించే అవకాశం ఉందని అంటున్నారు. సచివాలయం భవనాల నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థల్లో షార్ట్ లిస్ట్ తర్వాత ఎల్ అండ్ టితో పాటు షాపూర్జీ పల్లోంజీ సంస్థలు మిగిలాయి. సచివాలయం భవనాల నిర్మాణం వ్యయం ఒక్కో చదరపు అడుగుకు (ఎస్‌ఎఫ్‌టి) మూడు వేల రూపాయల వరకు ఖరారు చేయాలని ప్రభుత్వం భావించింది. అవసరమైయితే మరో ఐదు శాతం ఎక్కువ చేసి 3150గా నిర్ణయంచాలని భావించారు. అయితే ఎల్ అండ్ టి, షాపూర్జీ పల్లోంజీ వేసిన ఫైనాన్స్ బిడ్లలో 4 వేలనుండి 4200 రూపాయల వరకు పేర్కొన్నట్టు తెలిసింది. రెండు సంస్థలు ఎంత వరకు దిగివస్తాయో చర్చల తర్వాత తేలుతుంది. క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఎ) ఈ అంశంపై రెండు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. తాత్కాలిక భవనాల నిర్మాణాన్ని ఆరునెలల్లో పూర్తి చేసి రాష్ట్ర సచివాలయంతో పాటు రాజధాని కార్యాలయాలను జూన్ 30లోగా హైదరాబాద్ నుంచి కొత్త రాజధాని ప్రాంతానికి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తాత్కాలిక సచివాలయం భవనాల నిర్మాణం ప్రక్రియలో అవాంతరం ఏర్పడటంతో జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 10నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, భవన నిర్మాణ పనులను నిర్మాణ సంస్థకు అప్పగించాలని భావించారు. 12న ఫౌండేషన్ స్టోన్ వేస్తే యుద్ధప్రాతిపదికన భవనాల నిర్మాణం పూర్తి చేయాలని భావించారు. తాత్కాలిక సచివాలయం భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 182 కోట్లు కేటాయించింది. ఈ అంశంపై సిఎం చంద్రబాబు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండంతో రెండురోజుల్లో నిర్మాణ పనులపై అంగీకారం కుదిరే అవకాశముందని తెలిసింది. ఇందుకోసం 45 ఎకరాలను కేటాయిస్తూ, ప్రభుత్వం గురువారమే ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్ అండ్ టికే సచివాలయ భవనాల నిర్మాణం లభిస్తే మే చివరినాటికే నిర్మాణం పూర్తి చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది.