బిజినెస్

విదేశీ మారకం ముసుగులో హవాలా దందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ / వేములవాడ టౌన్, మార్చి 6: హవాలా అంటే అరబిక్ భాషలో బదిలీ.. అక్రమంగా చేసే మనీ ట్రాన్స్‌ఫరే హవాలా లేదా హుండీ అని పిలుస్తుంటారు. భారీ మొత్తంలో ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే డైరక్టుగా తీసుకొని వెళ్లాలి. లేదా బ్యాంక్‌లో వేయాలి.. కానీ హవాలా వ్యాపారానికీ ఇవేమీ అవసరం లేదు. ఒక్క్ఫోన్ కాల్ చాలు. హవాలా ఏజెంట్‌కి ఫోన్‌చేసి ఫలానా వాడికి.. ఫలానా చోట ఎంత ఇవ్వా లో చెబితే చాలు .. సమయానికి అంత డబ్బు చేరిపోతుంది. అందుకు ఏజెంట్ల కమీషన్ తీసుకుంటారు. ఇదంతా పక్కా చీకటి దందా.. బ్యాంకు లావాదేవీలతో అవసరం లేని బిజిసెస్.. పాన్‌కార్డు ఎవరూ అడగరు.. ఇన్‌కంటాక్సు లెక్కలు చూపాల్సిన పనిలేదు. ఎక్కడనుంచైనా.. ఎక్కడికైనా.. కూర్చున్న చోటు నుంచి లక్షలు రూపాయలను మార్చేయొచ్చు. జస్టు నోటిమాటతో.. ఫోన్‌కాల్‌తో ఎంతంటే అంతే సొమ్ము బదిలీ చేసుకోవచ్చు. సంపాదించిన ప్రతి పైసాకు లెక్కచూపాలి. కానీ లెక్కలో చూపని పైసలు కూడా ఉంటాయి. అదే నల్లడబ్బు.. ఆ నల్లడబ్బును సక్రమం చేసుకునేందుకు హవాలాను రాచమార్గం చేసుకుంటున్నారు నల్ల కుబేరులు. సర్కారు కళ్లుకప్పి గుట్టుగా తరలించే దందా ఇది. బ్యాంకులకు సైతం సెలవులుంటాయి కానీ.. ఈ దందాకు నో హాలిడేస్.. 24 గంటలూ అందుబాటులో ఉం టారు హవాలా ఏజెంట్లు.. బ్యాంకింగ్ రంగానే్న తలదనే్న నెట్‌వర్కు ఇది.. ఒక్కమాటలో చెప్పాలంటే అండర్ గ్రౌండ్ బ్యాకింగ్ సిస్టం. కేవలం నోటి మాట మీద సాగే వ్యాపారం ఇది. నమ్మకం మీద సాగే లక్షల రూపాయల వ్యాపా రం హవాలా. గంటల.. గంటలు.. క్యూ కట్టాల్సిన అవసరం లేదు. నిమిషాల్లో పని జరిగిపోతుంది. పెద్దవాళ్లు కాకుండా గల్ఫ్‌దేశాల్లో వలస కూలీలు తాము సంపాదించిన డబ్బును ఇంటికి తరచిండానికి ఈ హవాలాలను ఆశ్రయిస్తుంటారు.
బ్లాక్ మార్కెట్‌లో రహస్యంగా
సాగే వ్యాపారం
వాస్తవంగా గతంలో దొంగల భయంతో పుట్టుకొచ్చిన కరెన్సీ మార్పిడి ప్రక్రియ. కొన్ని శతాబ్దాల క్రితం అరబిక్ ముస్లిం దేశాల వర్తకులు ఎక్కువ సొమ్ము తీసుకెళ్తే దొంగలు దోచుకెళ్తారనే భయంతో తమ వెంట డబ్బులు తీసుకెళ్లే వారు కాదు. హవాలా పద్ధతిలో వ్యాపారులకు డబ్బులు చెల్లించేవారు.. ఆ తరువాత అదే అక్రమ వ్యాపారంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద నెట్‌వర్కు ఏర్పడింది. హవాలా ఏజెంట్లు ఏసీ గదులో.. ఆఫీసులో నిర్వహిం చేవారు కాదు. మార్కెట్లో కిరాణా కొట్టు.. టీ పౌడర్ దుకాణం... మాసాలా దినుసుల దుకాణం నిర్వాహకులే ఏజెంట్లు. ఎవరికీ అనుమానం రాకుండాలో ప్రోఫైల్ మెయింటైన్ చేస్తూ బడాబాబులతో వ్యాపారం చేస్తుంటారు. జిల్లాల్లో వేములవాడ, చందుర్తి, బోయినపల్లి, కథలాపూర్, మానాల, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో ఈ హవాలా దందా ఎక్కువగా సాగుతోంది.
కోడ్ భాషలతో...
కొత్త 500 రూపాయలను గ్రీన్ వెజిటబుల్, రూ. 2000 నోట్లను పింక్‌పేపర్‌గా కోడ్ పెట్టుకొని పిలుస్తుంటారు. పది లక్షల రూపాయలు బదిలీ చేయాలంటే ఐదు వేల పింక్‌పేపర్లు కావాలని కోడ్ భాషలో చెబుతుంటారు. హవాలా బిజినెస్ అంతా కోడ్ భాషలోనే సాగుతుంది. వీరంతా అక్రమార్కుల సేవలో 24 గంటల పాటు తరిస్తారు.
3నుంచి 10శాతం కమీషన్
హవాలా ద్వారా డబ్బులను మార్చుకునే పద్ధతిలో ఏజెంట్‌కు లక్షకు రూ. 3 నుంచి 10 శాతం కమీషన్‌కు తీసుకుంటారు. ఎన్ని లక్షలైనా సరే వెంటనే స్పందించి నోట్లను మార్చిడి చేసి అప్పటికప్పుడు కావాల్సిన వ్యక్తులకు డబ్బులను చేరవేస్తుంటారు.
భారీగా పట్టుబడిన విదేశీ కరెన్సీ
పట్టణంలో జిల్లా టాస్క్ఫుర్సు అధికారులు జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున విదేశీ మారకం లభించింది. అమెరిక్ డాలర్లు, యూరోలు, దుబాయి ధరమ్స్, రియాద్ కరెన్సీనోట్లు కలిపి 20లక్షల విలువ గల విదేశీ కరెన్సీనోట్లు, రూ. 10 లక్షల ఇండియన్ కరెన్సీ లభించాయి. మొత్తం 30 లక్షలకు విలువగల కరెన్సీని జిల్లా టాస్క్ఫుర్సు అధికారులు స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
అనుమతి లేకపోతే శిక్ష తప్పదు: ఎస్పీ
‘రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. వెస్ట్రన్, యూఏఈ ఎక్స్‌ఛేంజ్ ముసుగులో విదేశీ కరెన్సీ కొనుగోలు, అమ్మకాలు సాగించడం ఆర్థిక నేరం. అలాంటి వారిపై నిఘా ఉంచుతాం. అక్ర మ వ్యాపారాలు చేసే వారే నిరంతర తనిఖీలుంటాయి. పన్నులు చెల్లించకుండా అక్రమ మార్గంలో వ్యాపారం సాగిస్తే కఠినంగా శిక్షిస్తాం.’ అని ఎస్పీ విశ్వజిత్ కాంపాటి చెప్పారు.
chitram....
వేములవాడ టాస్క్ఫుర్సు దాడిలో
పట్టుబడిన విదేశీ కరెన్సీ