నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ విద్య నేర్చితినంచు విఱ్ఱవీగఁగ లేదు
భాగ్యవంతుఁడనంచుఁ బలుక లేదు
ద్రవ్యవంతుఁడనంచుఁ దఱచు నిక్కఁగలేదు
నిరతదానములైన నెఱపలేదు
పుత్రవంతుఁ డనంచు సంతసింపఁగ లేదు
భృత్యవంతుడనంచుఁ బొంగలేదు
శౌర్యవంతుడనంచు సంతసింపఁగ లేదు
కార్యవంతుడనంచుఁ గడపలేదు
తే॥ నలుగురికి మెప్పుగానైన నడవలేదు
నలినదళనేత్ర! నిన్నునే నమ్మినాను
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితహర!

భావం: ఓ స్వామీ! నేను విద్యావంతుడను, సంపన్నుడను, ధనవంతుడను, ధర్మదాతను, సంతానవంతుడను, భృత్యవంతుడను, శౌర్యవంతుడను, కార్యవంతుడను అని గర్వించలేదు. నల్గురు మెచ్చుకోవాలని కూడ ఇచ్చగించలేదు. నిన్ను మాత్రమే నమ్మినాను.