Others

ఆకాశం లేని సగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండడానికి
నాలుగంతస్తుల మేడ
కాళ్ల కింద ముండ్ల కంపల్లా కట్టుబాట్లు
కొండచిలువల్లా అభ్యంతర రేఖలు
తలెత్తుతే కాటేసే కోడెనాగులు!

ఏ బోనానికైనా
బొట్టులా వాడుకున్నారే గాని
నదిలా గౌరవించిందెవ్వడు
నదిలా నిలబెట్టిందెవ్వడు

ఏ జెండాలోనైనా
ఆకుపచ్చ రంగులా వాడుకున్నరేగాని
జాతీయ జెండాలా గౌరవించిదెవ్వడు
జాతీయ జెండాలా నిలబెట్టిందెవ్వడు

విప్లవాలెన్నైనా
అంగీలన్ని ఎరుపేగాని
వొంట్లో అసలు పసరును నలిపేసిందెవ్వడు
నలుపును నిలబెట్టిందెవ్వడు

విజయ దుందుభి ఊరేగింపులు
ప్రారంభ అలంకార స్వాగతాల్లో
గుమ్మడికాయల్లా దిష్టి తీసుకున్నరేగాని
అంబరాన నిలిపిందెవ్వడు
అరుంధతిని నిలబెట్టిందెవ్వడు
నీడ కింద బతుకు
నిప్పుతో సహజీవనం
ముళ్లకింద పువ్వుకు
పానగండం

నోట్లో తులసితీర్థాలు
చేతుల్లో కత్తులు
దోసిట్లో ఎర్రటి కుంకుమ
మనసుల్లో మయసభలు

మార్చి ఎనిమిదిన
ఏడాదికొక్కనాడే
దండలేసి
మూడొందల అరవై నాలుగు దినాలు
కాళ్ల కింద నలిపేసి
పంటికింద నమిలేసి
కంటిచూపుల్లో కాల్చేసే ఇంద్రులు

ఆకాశం సగమన్నారు
అవకాశాల్లో గుండుగీశారు
భూమి నాదే అన్నారు
మొలవకుండా మూడోపాదం మోపిండ్రు
ఆకాశంలేని సగం
విత్తనంలేని భూమే!

-వనపట్ల సుబ్బయ్య