కృష్ణ

సమన్వయంతో అధికారులు పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, ఫిబ్రవరి 12: కృష్ణా పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాట్‌ల వద్ద ఎలాంటి రద్దీ లేకుండా భక్తులు స్నానాలు ఆచరించేలా అధికారులు సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎస్‌పి విజయకుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కృష్ణా పరీవాహక ప్రాంతాలైన వేదాద్రి, ముక్త్యాలను సందర్శించిన ఆయన గతంలో నిర్మించిన పుష్కర ఘాట్లను పరిశీలించారు. పుష్కరాలకు ఆరు నెలల సమయం మాత్రమే ఉన్నందున ప్రాథమికంగా అంచనాలు వేసేందుకే తాను పర్యటిస్తున్నట్లు తెలిపారు. దేవాలయాల కార్యనిర్వహణ అధికారులు శ్రీరాం వరప్రసాద్, కొల్లా వెంకటేశ్వరరావు, తహశీల్దార్ అనిల్ జన్నిసన్‌ను ఇప్పటివరకూ ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపించింది తెలుసుకున్నారు. 12 రోజులపాటు జరిగే పుష్కరాలకు వేలాది మంది భక్తులు దూర ప్రాంతాల నుండి తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆ స్థాయిలో ఏర్పాట్లు జరగాలన్నారు. వాహనాల నియంత్రణ, స్నాన ఘాట్ల వద్ద ఎలాంటి తోపులాటలు, ప్రమాదాలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖులు, విఐపిల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు.

రాజకీయ వ్యభిచారులపై కేసులు నమోదుచేయాలి
సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ
నందిగామ, ఫిబ్రవరి 12: పొట్టకూటి కోసం వ్యభిచారం చేసే వారిపై కాకుండా రాజకీయ వ్యభిచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఐ జాతీయ నాయకుడు కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాదు నుండి విజయవాడ వెళుతూ మార్గమధ్యంలో కొద్దిసేపు స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవనం వద్ద ఆగారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ స్వప్రయోజనాలు ఆశించి పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారికి పూలమాలలు వేసి ఆహ్వానిస్తున్నారని, ఇలా రాజకీయ వ్యభిచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. తెలంగాణాలో తెదేపా ప్రజా ప్రతినిధులు తెరాసాలో చేరుతుంటే ఆ పార్టీ వారు గగ్గోలు పెట్టి నానా హంగామా చేశారని, అలానే ఎపిలో వైకాపా నుండి తెదేపాలోకి లాక్కొనే యత్నాలను తెదేపా ముమ్మరం చేస్తున్నారని, మరి తెదేపా వారికి అక్కడి సంఘటనలు తప్పుగా ఇక్కడి సంఘటనలు ఒప్పుగా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇద్దరు చంద్రులు గగ్గోలు పెట్టారని ఎద్దేవా చేశారు. ఇద్దరు చంద్రులకు రాజకీయ నైతిక విలువలు లేవని విమర్శించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో సిఎం చంద్రబాబు విఫలం అయ్యారని అన్నారు. ప్రత్యేక హోదా సాధనలో సిఎం చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్‌డిఎ భాగస్వామ్యంతో పాటు మంత్రివర్గం నుండి వైదొలగి హోదా సాధనకు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి కేంద్రంపై సమర శంఖారావం పూరించేందుకు సిద్ధం కావాలన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
పెడన, ఫిబ్రవరి 12: స్థానిక తోటమూల వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందాడు. తోటమూల ప్రాంతానికి చెందిన పొన్నా కోటయ్య (30) ఎపి 16ఎవై 4467 నెంబరు గల ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఎపి 16టిఎఫ్ 5336 నెంబరు గల ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో కోటయ్యకు తీవ్ర గాయాలు కావటంతో హుటాహుటిన మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలో కోటయ్య మృతి చెందాడు. పెడన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నీరొచ్చిన వెంటనే ఎస్‌ఎస్ ట్యాంక్‌ను నింపుతాం..

ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 12: బందరు కాలువకు ఏ క్షణంలో నీరు వచ్చినా తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లోకి పంపింగ్ చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేశామని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావుతో కలిసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద నీటి పంపింగ్ కోసం చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తాగునీటి సమస్య ఎదురైందన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. శ్రీశైలం నుండి నాలుగు టియంసిల నీటి విడుదల జరిగిందన్నారు. బందరు కాలువలకు నీరు ఎప్పుడు వచ్చినా తక్షణమే తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, పంపుల చెరువులను పూర్తి స్థాయిలో నింపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పురపాలక సంఘానికి చెందిన మోటార్లతో పాటు ఒఎన్‌జిసి అధికారులతో సంప్రదించి మరిన్ని మోటార్లను అదనంగా ఏర్పాటు చేశామన్నారు. అంతే కాకుండా వాటర్ పంపింగ్‌లో అనుభవం కలిగిన నిపుణులతో మాట్లాడి అదనంగా మోటార్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పంపింగ్‌ను 24 గంటలు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం చేశామన్నారు. మున్సిపల్ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు కూడా ఎప్పటికప్పుడు పంపింగ్ విధానాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. పంపింగ్ సమయంలో విద్యుత్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్‌లు, జనరేటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ పట్టణ ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం చెరువులు నింపేందుకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. పంపింగ్ పనులకు ఎలాంటి అటంకాలు కలుగకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం (చంటి), కమిషనర్ జస్వంతరావు, తహశీల్దార్ నారదముని, ఎంపిడివో జివి సూర్యనారాయణ, కౌన్సిలర్లు నారగాని ఆంజనేయ ప్రసాద్, కొట్టె వెంకట్రావ్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, టిడిపి నాయకులు ఇలియాస్ పాషా, మున్సిపల్, ఆర్‌డబ్ల్యుయస్ అధికారులు పాల్గొన్నారు.

గొంతెండుతున్నా నీరివ్వరా?
* మున్సిపాల్టీ ఎదుట వైసిపి ధర్నా
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 12: పట్టణ ప్రజల గొంతెండుతున్నా గుక్కెడు నీరు ఇచ్చే పరిస్థితిలో అధికార పక్షం లేదని ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. పట్టణంలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పురపాలక సంఘ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వైఎస్‌ఆర్ సిపి కౌన్సిలర్లతో పాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. మహిళలు ఖాళీ కుండలు, బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసిపి పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా మాట్లాడుతూ తాగునీటి సమస్యను పరిష్కరించడంలో పురపాలక సంఘ పాలకవర్గం తీవ్రంగా విఫలమైందన్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల నేడు పట్టణంలో తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రతిపక్ష నేత అచ్చాబా, కౌన్సిలర్లు శీలం బాబ్జి, లంకా సూరిబాబు, మేకల సుబ్బన్న, గూడవల్లి నాగరాజు, కాగిత జవహర్, మీర్ అస్ఘర్, ధనికొండ నాగమల్లేశ్వరి, మట్టా తులసి, కాకొల్లు లీలాకుమారి, బందెల కవిత, కోసూరు లక్ష్మీ నాంచారయ్య, వైసిపి నాయకులు బొర్రా విఠల్, మారుమూడి విక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జక్‌ఫెస్ట్ వేడుకలు
గుడ్లవల్లేరు, ఫిబ్రవరి 12: స్థానిక గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల గత రెండు రోజులుగా జక్ ఫెస్ట్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థినీ విద్యార్థులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. క్రీడా పోటీల్లో భాగంగా బాస్కెట్ బాల్, వాలీబాల్, టేబుల్ టెన్నీస్, టెన్నీస్ పోటీలు నిర్వహించారు. టెక్నికల్ పేపర్ ప్రజంటేషన్, మోడల్ ప్రజంటేషన్, రోబో రేస్ వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గురువారం రాత్రి పద్మవిభూషణ్ హరిప్రసాద్ సౌరప్రియ నిర్వహించిన వేణు గానం ప్రేక్షకులను రంజింప చేసింది. లలితా బెనర్జి బృందం నిర్వహించిన బాలే నృత్యరూపం ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకుంది. విశ్వ కవి రవీంద్రనాధ్ ఠాగూర్ నాటకం ఆధారంగా స్ర్తి, పురుషుల మధ్య ప్రేమ శారీరకంగా ఉండకూడదని మానసికంగా ఉండాలన్న సందేశం ఇచ్చారు.

రసవత్తరంగా సాగుతున్న సౌత్ జోన్ వాలీబాల్ టోర్నీ

ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 12: స్థానిక ఆంధ్ర జాతీయ కళాశాల క్రీడా మైదానంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న సౌత్ జోన్ ఇంటర్ వర్శిటీ వాలీబాల్ ఉమెన్ పోటీలు హోరా హోరీగా జరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి నుండి 55 విశ్వ విద్యాలయాల జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. రెండవ రోజైన శుక్రవారం 24 మ్యాచ్‌లు నిర్వహించారు. ఇందులో వాక్ ఓవర్ పద్ధతిలో నాలుగు జట్లు ముందుకు సాగాయి. 21 జట్ల మధ్య పోటీ రసవత్తరంగా జరిగింది. బెంగుళూర్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ కేరళ, మధురై కామరాజ్ యూనివర్శిటీ (తమిళనాడు), ఉస్మానియా యూనివర్శిటీ (హైదరాబాద్), మంగుళూర్ యూనివర్శిటీ (కర్ణాటక), అన్నామలై యూనివర్శిటీ (తమిళనాడు) జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన కృష్ణా విశ్వ విద్యాలయం (మచిలీపట్నం) జట్టు రెండవ రోజు కూడా తన సత్తా చాటింది. పాండిశే్చరి యూనివర్శిటీ జట్టుపై 25-22, 25-03, 25-11 స్కోరుతో విజయదుందుభి మోగించింది.
రెండవ రోజు విజేతలు వీరే
* అన్నామలై యూనివర్శిటీ (తమిళనాడు) జట్టు తొలి మూడు సెట్లలోనే ప్రత్యర్థి విక్రమ సింహపురి యూనివర్శిటీ (ఆంధ్రప్రదేశ్) జట్టును చిత్తు చేసింది. 25-09, 25-07, 25-06 స్కోరుతో విజృంభించింది.
* జెఎన్‌టియు కాకినాడ జట్టు రాణి చెన్నమ్మ యూనివర్శిటీ (కర్ణాటక)పై 26-08, 25-17, 22-25, 23-25, 15-10 స్కోరుతో విజయం సాధించింది.
* గాంధీగ్రామ్ డీమ్డ్ యూనివర్శిటీ (తమిళనాడు) జట్టు తొలి మూడు సెట్లలో 25-05, 25-11, 25-08 స్కోరు సాధించి మహాత్మ గాంధి యూనివర్శిటీ (తెలంగాణ) జట్టుపై జయకేతనం ఎగుర వేసింది.
* మంగళూరు యూనివర్శిటీ (కర్ణాటక) జట్టు కూడా తొలి మూడు సెట్లలో 25-12, 25-08, 25-13 స్కోరుతో ఎస్‌పిఎం విశ్వ విద్యాలయం (ఆంధ్రప్రదేశ్) జట్టుపై విజేతగా నిలిచింది.
* విటియు (కర్ణాటక) జట్టు, క్రైస్ట్ యూనివర్శిటీ (బెంగుళూరు) జట్టుపై 25-14, 25-14, 25-07 స్కోరుతో విజయం సాధించింది.
* హిందుస్థాన్ యూనివర్శిటీ (చెన్నై) జట్టు 25-06, 25-07, 25-08 స్కోరుతో శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీ (అనంతపూర్) జట్టును చిత్తు చేసింది.
* కువెంపు యూనివర్శిటీ (కర్ణాటక) జట్టు ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ (రాజమండ్రి) జట్టుపై నాలుగు సెట్లు ఆడి మొదటి రెండు, నాల్గవ సెట్లలో 25-21, 25-22, 25-19 స్కోరుతో విజయం సాధించింది.
* ఆంధ్రా యూనివర్శిటీ (విశాఖపట్నం) జట్టు కాకతీయ యూనివర్శిటీ (వరంగల్) జట్టుపై 25-20, 25-21, 25-11 స్కోరుతో విజేతగా నిలిచింది.
* పెరియార్ యూనివర్శిటీ (తమిళనాడు) జట్టు 25-06, 25-15, 25-08 స్కోరుతో శాతవాహన యూనివర్శిటీ (తెలంగాణ)పై గెలుపొందింది.
* బెంగుళూరు యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ కేరళ జట్ల మధ్య రసవత్తర పోరు జరిగింది. నాలుగు సెట్లలో మొదటి రెండు సెట్లు, నాల్గవ సెట్‌లో 26-24, 25-22, 25-19 స్కోరు సాధించి బెంగుళూరు జట్టు విజేతగా నిలిచింది.

* జెఎన్‌టియు (హైదరాబాద్) జట్టు 25-14, 25-22, 25-07 స్కోరుతో విజ్ఞాన్ యూనివర్శిటీ (ఎపి) జట్టుపై గెలుపొందింది.
* విఇఎల్‌ఎస్ యూనివర్శిటీ (చెన్నై) జట్టు ఎస్‌సిఎస్‌విఎం విద్యాలయ యూనివర్శిటీ (తమిళనాడు) జట్టుపై 25-07, 25-05, 25-10 స్కోరుతో విజయాన్ని అందుకుంది.
* మధురై కామరాజ్ యూనివర్శిటీ (తమిళనాడు) జట్టు ఉస్మానియా యూనివర్శిటీ (హైదరాబాద్) జట్టుపై విజయం సాధించింది. నాలుగు సెట్లు ఆడగా తొలి సెట్‌లో ఓడిపోయినా మిగిలిన మూడు మ్యాచ్‌లలో 27-25, 25-15, 25-16 స్కోరుతో విజయం సాధించడం విశేషం.
* భారతీయార్ యూనివర్శిటీ 25-21, 25-19, 25-20 స్కోరుతో యూనివర్శిటీ ఆఫ్ మైసూర్ జట్టుపై పైచెయ్యి సాధించింది.
* యూనివర్శిటీ ఆఫ్ కాలికట్ జట్టు కర్ణాటక యూనివర్శిటీపై 25-21, 25-07, 25-13 స్కోరుతో విజయం సాధించింది.
* అన్నా యూనివర్శిటీ (తమిళనాడు) జట్టు 25-15, 25-09, 25-11 స్కోరుతో భారతీదాసన్ యూనివర్శిటీ (తమిళనాడు) జట్టుపై గెలుపొందింది.
* ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (జట్టు) జెఎన్‌టియు (కాకినాడ) జట్టుపై 14-25, 25-23, 25-06, 25-14తో పోరాడి గెలిచింది.
* గాంధీగ్రామ్ డీమ్డ్ యూనివర్శిటీ (తమిళనాడు) జట్టు సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కర్ణాటక జట్టుపై 25-10, 25-11, 25-06 స్కోరుతో గెలుపొందింది.
* మంగళూర్ యూనివర్శిటీ (కర్ణాటక) జట్టు అన్నామలై యూనివర్శిటీ (తమిళనాడు) జట్టుతో తలపడి 25-20, 25-20, 25-22 స్కోరుతో విజయం సాధించింది.

విద్యార్థులు విజ్ఞానం, నైపుణ్యం పెంపొందించుకోవాలి

కంచికచర్ల, ఫిబ్రవరి 12: వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి అవసరమైన టెక్నాలజీని రూపొందించడానికి ఇంజనీరింగ్ విద్యార్థులు కృషి చేయాలని షార్ మాజీ డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ అన్నారు. స్థానిక మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం మిక్ ఫెస్ట్ 2016 అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలని, విజ్ఞానం, నైపుణ్యం, ప్రవర్తన పెంపొందించుకోవాలని సూచించారు. కళాశాల అభివృద్ధికి కృషి చేసిన యాజమాన్యంను అభినందించారు. గౌరవ అతిధిగా విచ్చేసిన డివిజనల్ మేనేజర్ ఐటిసి వివి సుబ్రమణ్యం మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే దీక్ష, నిరంతర కృషి, పట్టుదల ఎంతో దోహదపడతాయన్నారు. వైస్ చైర్మన్ నిమ్మగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆవిష్కరణల దిశగా కృషి చేయాలన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. స్పోర్ట్స్ మరియు కల్చరల్ కాంపిటేషన్స్ విజేతలకు బహుమతులు అందజేశారు. కళాంజలి వారి సహకారంతో నిర్వహించిన మిస్టర్ అండ్ మిస్ మిక్ ఒక హైలైట్‌గా నిలిచింది. కళాశాల చైర్మన్ ఎంవి రమణారావు ఆధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్లానింగ్ అండ్ డవలప్‌మెంట్ డైరెక్టర్ మాగంటి శ్రీనివాసరావు, సిఇఒ పాండురంగారావు, డైరెక్టర్ అకడమిక్స్ నిమ్మగడ్డ కృష్ణ, ప్రిన్సిపాల్ డాక్టర్ కెబికె రావు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

రెండోరోజూ కొనసాగిన స్టాంపు వెండర్ల సమ్మె
మైలవరం, ఫిబ్రవరి 12: స్టాంపువెండర్ల సమ్మె శుక్రవారం రెండోరోజు కూడా కొనసాగింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం ప్రైవేటుపరం చేయటాన్ని నిరశిస్తూ రాష్ట్ర స్టాంపువెండర్ల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు వీరు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రైవేటుపరం చేసే యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దీని వలన తమకు జీవనోపాధి లేక తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మెలో స్టాంపువెండర్లు తొమ్మండ్రు సాంబయ్య, పగడాల సాంబశివరావు, ఖాజ, నజీర్, భాషా, విశే్వశ్వరరావు, ఉమామహేశ్వరి, శివ, అనిల్, శేషాచారి, నాగేశ్వరరావు, ప్రసాద్, మధుసూధనరావు, సుభాషిణి, రామ్మూర్తి, వెంకట్రావ్, సాల్మన్‌రాజు పాల్గొన్నారు.
సర్వేయర్‌లను అడ్డుకున్న భూ ఆక్రమిత రైతులు
నందిగామ, ఫిబ్రవరి 12: మండలంలోని పెద్దవరం గ్రామ పరిధిలో ప్రభుత్వం ఎపిఐఐసికి కేటాయించిన భూముల్లో సర్వే పనులకు ఆటంకం ఎదురైంది. శుక్రవారం సర్వేకు వెళ్లిన ఉద్యోగులను వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులు అడ్డుకున్నారు. ఏళ్ల తరబడి భూములను సాగు చేసుకుంటున్న తమకు న్యాయం చేయకుండా భూముల్లో సర్వే చేయడానికి వీలులేదంటూ సర్వేయర్‌లను అడ్డుకున్నారు. ఎస్‌ఐ తులశీరామకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తుతో సర్వేయర్‌లు అక్కడకు వెళ్లగా ఆక్రమిత రైతులు అడ్డుకోవడంతో వారు వెనుతిరిగారు.
సారా తయారీదారులపై బైండోవర్ కేసులు
కృత్తివెన్ను, ఫిబ్రవరి 12: మండలంలో సారా తయారు చేస్తున్న 23 మందిపై ఎక్సైజ్ పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న వారిని తహశీల్దార్ మధుసూదనరావు ఎదుట హాజరుపర్చారు. గతంలో ఈ 23 మందిపై ఎక్సైజ్ కేసులు ఉండటం గమనార్హం. ‘నవోదయ’ కార్యక్రమంలో భాగంగా సారా తయారీదారులపై దాడులు నిర్వహిస్తున్నట్లు బంటుమిల్లి ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అమరేశ్వరరావు తెలిపారు. బందరు టాస్క్ఫోర్స్ బృంద సభ్యులు నిడమర్రులో పది మందిని, చినగొల్లపాలెంలో ఆరుగురిని, పెదగొల్లపాలెంలో ముగ్గురిని, పోడులో ముగ్గురిని, పడతడికలో ఒకరిని అరెస్టు చేశారు.

భూగర్భ జల మట్టాలను పెంపు
ప్రభుత్వ లక్ష్యం
* జాతీయ సదస్సు ముగింపు సభలో మంత్రి దేవినేని ఉమ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 12: భూగర్భజల ఉపరితల, సమన్వయ నీటి వినియోగంతో రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించేందుకు జాతీయ సదస్సు దోహదపడుతుందని, 2017-18లో అంతర్జాతీయ సదస్సు మన రాష్ట్రంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర జలవనరులు, భూగర్భ జల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉపరితల, భూగర్భ జలాల సంయుక్త వినియోగంపై రెండు రోజులపాటు నగరంలోని సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సదస్సుకు వివిధ రంగాల నిపుణులు, శాస్తవ్రేత్తల నుండి పరిశోధక పత్రాలు, ప్రభుత్వానికి సమర్పించనున్నామని మంత్రి చెప్పారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టే సమయంలో ఉపరితల, భూగర్భజల సమన్వయం ప్రాజెక్టులో భాగంగా ఉండాలని మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో భారీ, మధ్యతరగతి ప్రాజెక్టులలో విజయవంతమైన పద్ధతులను క్రోడీకరించి ప్రభావవంతమైన పద్ధతుల ముసాయిదా అమలుపరిచేందుకు ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుతం కృష్ణా వాటర్ బేసిన్ నీటి ఎద్దడిని ఎదుర్కొంటోందని, శ్రీశైలం, నాగార్జున సాగర్ నుండి నీరు విడుదల కానప్పటికీ ఖరీఫ్‌లో 95 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, రబీలో 53 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు కోటి ఎకరాలకు నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూగర్భజలాల వినియోగం, ఉపరితల, భూగర్భజల సమన్వయం వినియోగం ప్రాముఖ్యత, ప్రాధాన్యత గుర్తించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఇటీవల రాయలసీమ, నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన భూగర్భజల స్థాయి 33 మీటర్ల నుండి 14 మీటర్ల వరకు చేరుకున్నాయన్నారు.
జాతీయ సదస్సులో ప్రొ.ఎడి రావు మాట్లాడుతూ ట్యాంక్ ఇరిగేషన్ పద్ధతి అనేది భారతదేశపు పురాతన వనరు. ఈ పద్ధతి వ్యవసాయదారులకు ఉపయోగకరమని, ప్రొఫెసర్ ఎడి రావు తెలిపారు.
వరదనీటిని వృథాగా సముద్రంలోనికి రానివ్వకుండా వివిధ నీటి విలువ కట్టడాల ద్వారా అదుపు చేసి వ్యవసాయానికి ఉపయోగించవచ్చని ప్రొఫెసర్ బి.వెంకటేశ్వరరావు తెలిపారు. శాలినిటీ జోన్‌లో నీరు మరియు లవణ సమతుల్యాన్ని సాల్ట్‌మోడ్ అనే ఒకకంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా కనుగొనవచ్చని, ఈ సాఫ్ట్‌వేర్‌ని పరీక్షిస్తున్నారని ఎస్.వరదరాజన్ తెలిపారు. జాతీయ సదస్సు నిర్వహణ ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించారని గుజరాత్ రాష్ట్ర సాంకేతిక సలహాదారు డా.డిమాంత్ వ్యాస్ కొనియాడారు.
రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ అధ్యక్షత వహించారు. ముగింపు కార్యక్రమంలో నీటిపారుదల నిపుణుల సలహా మండలి కమిటీ సభ్యులు చెరుకూరి వీరయ్య, నీటి పారుదల శాఖ ఇంజనీర్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్లు గిరిధర రెడ్డి, సయ్యద్ సాబ్జాన్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ ఎడిరావు, ఎపిఎస్ ఐడిసి, జెఎండి వెంకటేశ్వరరావు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఛైర్మన్ ఐఎస్ ఎస్.రాజు, ఇంటర్ స్టేట్ చీఫ్ ఇంజనీర్ డి.రామకృష్ణ, బిఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజీ బెంగుళూరు ప్రొఫెసర్ కె ఆర్ సురేష్, గ్రౌండ్ వాటర్ నిపుణులు మాజీ చీఫ్ ఇంజనీర్ డా.తవ్వార్, కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

నేడు దుర్గమ్మ సన్నిధిలో విజరుూభవ
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 12: విద్యార్థులందరికీ రానున్న వార్షిక పరీక్షల్లో అఖండ విజయం సాధించాలని వీరికి అమ్మవారి ఆశీస్సులను అందించాలనే సత్‌సంకల్పంతో శనివారం విజరుూభవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటంతోపాటు దీనికి సంబంధించిన ఏర్పాట్లు సైతం దుర్గగుడి ఇవో పూర్తి చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ఉదయం శ్రీ సరస్వతీదేవి అలంకారంతో విద్యార్థులకు దివ్యదర్శనం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఇవో నరసింగరావు తెలిపారు. అలాగే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు సైతం ఉచిత దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆయన ఈ విలేఖరితో మాట్లాడుతూ నగరానికి చెందిన సుమారు 40వేల విద్యార్థులు అమ్మవారి సన్నిధికి వచ్చే అవకాశం ఉందని దీనికి అనుగుణంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కనకదుర్గనగర్ నుండి విద్యార్థులకోసం ఉచితంగా దేవస్థానం బస్‌లను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఘాట్‌రోడ్‌లోని ఓం టర్నింగ్ నుండే విద్యార్థుల కోసం ప్రత్యేక క్యూమార్గం ఏర్పాటు, భవానీదీక్ష మండపంలో ఏర్పాటు చేసిన దేవత మూర్తులను దర్శించుకొని అంతరాలయంలో శ్రీ సరస్వతీదేవి అలంకారంతో ఉన్న శ్రీకనకదుర్గమ్మను దర్శించుకునే విధంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అమ్మవారిని దర్శించుకున్న విద్యార్థులకు పెన్ను, చిన్నలడ్డూ,రక్షబంధనం, కుంకుమ, ఫొటో ఒక బ్యాగ్‌లో వేసి ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే వివిధ సెక్షన్ సిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహించి గతం సంవత్సరం కంటే ఈసంవత్సరం ఈప్రత్యేక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టినట్లు ఇవో తెలిపారు. ఉదయం శ్రీ సరస్వతీహోమాన్ని నిర్వహించటం జరుగుతోందన్నారు. స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో విజరుూభవ కార్యక్రమానికి సంబంధించిన వైదిక కార్యక్రమాలను నిర్వహణలో జరుగుతాయన్నారు. ఘాట్‌రోడ్‌లో మార్గంలో పెద్ద పెద్ద షామియాలు, మంచినీటి సౌకర్యం, ఉచిత ప్రసాదాల పంపిణీ ఏర్పాటు చేసినట్లు ఇవో చెప్పారు.

నేటి మెగా బిసి రుణమేలాకు ఏర్పాట్లు పూర్తి
* కలెక్టర్ బాబు ఎ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 12: జిల్లాలో చంద్రన్న స్వయం ఉపాధి మెగా బిసి రుణమేలాకు పూర్తిస్థాయి ఏర్పాట్లను చేపడుతున్నట్లు కలెక్టర్ బాబు ఎ తెలిపారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో చేపడుతున్న ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ మెగా రుణమేలాలో లబ్ధిదారులతో పాటు రుణాలు పొందేందుకు, ప్రభుత్వ పథకాలపై వివరాలు తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. బిసి కార్పొరేషన్ ద్వారా మరియు బిసి సంక్షేమ శాఖ ద్వారా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందన్నారు. ఆయా అంశాలపై రూపొందించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుండి విజయపథంలో అడుగులు వేస్తున్న పలువురు లబ్ధిదారులతో కూడిన స్టాల్స్‌ను స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేశామన్నారు. 6 బ్లాకులుగా సభా ప్రాంగణం రూపుదిద్దుతున్నామని అదేవిధంగా పలు అంశాలతో కూడిన స్టాల్స్ కూడా సభకు వనె్న తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఫెడరేషన్ ఆర్థిక సంస్థ ఛైర్మన్ పి.రంగనాయకులు తదితరులు హాజరు కావడం జరుగుతుందన్నారు. ప్రతి బ్లాకుకు ఇద్దరు ఎమ్మార్వోలు, ఇద్దరు ఎంపిడివోలు ఇన్‌ఛార్జిలుగా నియమించాలని కలెక్టర్ ఆదేశించారు.

అక్రమ నిర్మాణాలపై కొరడా
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 12: నగరంలో నానాటికీ అధికమవుతున్న అనధికార నిర్మాణాలపై విఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు చేపట్టిన తొలగింపు చర్యలు చర్చనీయాంశమైనాయి. రెండు రోజులుగా నిరాటంకంగా జరుపుతున్న కూల్చివేత చర్యలతో ఆయా నిర్మాణాలకు నేతృత్వం వహించిన ప్రజాప్రతినిధులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం చేపట్టిన చర్యలు నగర మేయర్, డివిజన్ కార్పొరేటర్లతోపాటు విఎంసి టౌన్‌ప్లానింగ్ అధికారుల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఇటీవల కౌన్సిల్ హాల్లో ఆన్‌లైన్ ప్లాన్ మంజూరుపై టౌన్‌ప్లానింగ్ అధికారులతోపాటు లైసెన్స్‌డ్ ఇంజనీర్లతో నిర్వహించిన సమీక్షలో నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ బహిరంగంగానే విమర్శలు చేసి కలకలం సృష్టించిన వైనం అందరికీ తెలిసిందే. మేయర్ వ్యాఖ్యలతో కదిలిన టౌన్ ప్లానింగ్ యంత్రాంగం ఆయా నిర్మాణాల తొలగింపు చర్యలకు పూనుకోవడం గమనార్హం. డివిజన్ కార్పొరేటర్లతోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల ప్రోత్సాహంతోనే జరిపిన నిర్మాణాలపై పాలక ప్రజాప్రతినిధులే బహిరంగ విమర్శలు చేసి తమను దోషులుగా చిత్రీకరించడం ఎంతవరకు సబబని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఒకొక్క నిర్మాణం వెనుక లక్షలాది రూపాయలను వసూలు చేసిన కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు తొలగింపు చర్యలపై భవన యజమానులకు సర్ధి చెప్పలేక సతమతమవుతూ తొలగింపు చర్యలను నిలువరించేందుకు పావులు కదుపుతున్నట్టు వినికిడి. ఇదిలావుండగా అక్రమ భవనాల తొలగింపు చర్యలు చేపడుతున్న ప్రస్తుత తరుణంలో ఆయా చర్యలు చేపట్టలేక టౌన్‌ప్లానింగ్ అధికారులు సెలవుపై వెళ్లేందుకు సమాయత్తమవుతుండగా ఇప్పటికే ఒకరిద్దరు సెలవుపెట్టిన విషయం గమనార్హం. అనధికార నిర్మాణాలపై బహిరంగ విమర్శలు చేసి కలకలం సృష్టించిన మేయర్ శ్రీ్ధర్ త్వరలోనే ఆయా నిర్మాణాలపై మొబైల్ కోర్టు విచారణ ప్రక్రియతో భారీ మొత్తాల్లో అపరాధ రుసుము వసూలు చేయించేందుకు కసరత్తు చేస్తున్నారు.

పారిశుద్ధ్య కార్మికులను పరుగులు పెట్టిస్తున్న మురుగు
పాతబస్తీ, ఫిబ్రవరి 12: నగర పాలక ఇంజనీరింగ్ విభాగం అధికారుల చర్యల వల్ల పారిశుద్ధ్య కార్మికులు మాటిమాటికి పరుగులు తీయాల్సి వస్తోంది. మురుగు కాలువలకు చెత్త అడ్డుపడి, రోడ్డుపైకి మురుగు నీరు ఏరులై పారుతోంది. అలా వచ్చిన నీరు మురుగు కాలువలలోకి వెళ్లే మార్గం లేక పారిశుద్ధ్య పనివారు, డ్వాక్రా గ్రూపుల స్వీపర్లు పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా కొండ దిగువ ప్రాంతాల్లోని మురుగు కాలువలు చెత్తతో మాట మాటికీ పూడికకు గురవుతున్నాయి. ప్రధాన రోడ్లు కింద భాగాన్నుండి మురుగు కాలువలు తవ్వి చప్టాలు, ఆపై తారురోడ్లు వేస్తున్నారు. చప్టాల ముందు ఐరన్ గ్రిల్స్ వేయడం వల్ల కొండ ప్రాంతాల నుండి కొట్టుకొచ్చిన చెత్త, వాడిపారేసిన క్యారీబ్యాగులు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఐరన్ గ్రిల్స్‌కి అడ్డుపడుతున్నాయి. దాంతో మురుగు నీరు వెళ్లే మార్గం లేక రోడ్డుపైకి ఎగదన్నుతున్నాయి. ఐరన్ గ్రిల్స్ వద్ద చెత్తను తొలగించినా రోడ్డుమీదకి వచ్చిన మురుగు నీరును సిబ్బంది బొచ్చెలతో ఎత్తి మురుగు కాలువల్లో పోయాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులు శ్రీనివాస మహల్ సెంటరు, ఆంజనేయ వాగు సెంటరు, కలరా ఆసుపత్రి సమీపంలోని ఫైర్‌స్టేషన్ వద్ద, గొల్లపాలెం గట్టు ప్రాంతంలో ఏర్పడుతున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి యుజిడి పనులు చేయించినా ఇంజనీర్లు కొండ ప్రాంతాల్లో సరైన తీరులో మురుగు కాలువలు నిర్మించకపోవడం వల్లే ఒకే సమస్య పదే పదే పునరావృతమవుతోంది. ఇంజనీరింగ్ విభాగం అధికారులు శాశ్వత పరిష్కారర మార్గం అనే్వషించాలని స్థానికులు కోరుతున్నారు.

సెంట్రల్ ఏసిపికి స్థాన చలనం
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 12: రాష్టవ్య్రాప్తంగా జరిగిన డిఎస్పీల బదిలీల్లో భాగంగా కమిషనరేట్‌లో ఇద్దరు ఏసిపిలకు స్థాన చలనం కలిగింది. వీరిలో ఒకరు సెంట్రల్ ఏసిపి కాగా, మరొక స్థానం ఈస్ట్ ఏసిపి. అయితే కొంతకాలం క్రితం ఈస్ట్ ఏసిపిగా నియమించబడిన అధికారి బాధ్యతలు స్వీకరించకుండానే ఆయన బదిలీ రద్దయింది. రాష్ట్రంలో 15మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ డిజిపి జెవి రాముడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా కమిషనరేట్‌లోని సెంట్రల్ ఏసిపిగా పని చేస్తున్న టి ప్రభాకర్‌బాబు ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. ఈయన్ను ఇంటిలిజెన్స్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా సిఐడి విభాగంలో పని చేస్తున్న డిఎస్పీ ఎన్ సత్యానందంను సెంట్రల్ ఏసిపిగా నియమించారు. సత్యానందంకు ఇటీవల రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పోలీసు మెడల్ లభించింది. సత్యానందం గతంలో మాచవరం, సూర్యారావుపేట, ట్రాఫిక్ తదితర విభాగాల్లో సిఐగా పని చేశారు. సెంట్రల్ ఏసిపిగా నియమితులైన సత్యానందం మరో వారం రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదిలావుండగా ఈస్ట్ జోన్ ఏసిపిగా గతంలో ఐపిఎస్ అధికారి అభిషేక్ మహంతి వ్యవహరించారు. కొంతకాలం క్రితం ఈయన్ను బదిలీ చేస్తూ కనకరాజు అనే డిఎస్పీని నియమించగా ఆయన ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించలేదు. దీంతో మహిళా పోలీస్టేషన్ ఏసిపి పివి నాయుడు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించని కనకరాజు బదిలీని రద్దు చేస్తూ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ స్థానంలో కొద్దిరోజుల్లో ఐపిఎస్ అధికారిని నియమంచే అవకాశం ఉంది.

రేపు ఖురాన్ కంఠస్థ పోటీలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 12: నేటి సమాజం ఎంతో సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ వివిధ దురలవాట్లతో మనిషి రోజురోజుకు నైతికంగా దిగజారుతున్న నేపధ్యంలో మనిషిలో దైవభీతిని, ఆధ్యాత్మిక చింతన, దైవ గ్రంథం పట్ల భక్తిశ్రద్ధలను పెంపొందించే దిశలో ఈనెల 14వ తేదీ ఆటోనగర్ టెక్నీషియన్స్ హాలులో ఖుర్‌ఆన్ కంఠస్థ పోటీలను నిర్వహిస్తున్నామని యునైటెడ్ ఫోరం ఫర్ ఖుర్ ఆన్ కస్టడీస్ చైర్మన్ ఎండి దావూద్ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఖుర్‌ఆన్ కంఠస్థ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. మొత్తం 3500 మంది బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొనగా ప్రాథమిక ఎంపికలు పూర్తయ్యాయని, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక పత్రం, రూ.500ల నగదు దివ్య ఖుర్‌ఆన్ తెలుగు అనువాద గ్రంథం, జ్ఞాపిక అందజేసామన్నారు. ఇక ఆదివారం ఫైనల్స్ జరుగబోతున్నాయి. 3 నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రథమ బహుమతి కింద రూ.20వేలు, రెండో బహుమతి కింద రూ.15వేలు, మూడో బహుమతి కింద రూ.10వేలు, అలాగే