ఆంధ్రప్రదేశ్‌

నూతన ఒరవడికి శ్రీకారం ఆధునిక టెక్నాలజీతో బీర్ తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మార్చి 9: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అప్పటికప్పుడు బీర్ తయారు చేసి ఇచ్చే నూతన ఒరవడికి విజయవాడ నగరంలో శ్రీకారం చుట్టారు. నగరంలోని మొగల్రాజపురం విపి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఐరన్ హిల్ మిని బ్రేవరి రెస్టారెంట్ శుక్రవారం ప్రారంభమైంది. ఈసందర్భంగా రెస్టారెంట్ మేనేజింగ్ పార్టనర్ చేకూరి తేజ, భార్గవ స్వరూప్‌లు మాట్లాడుతూ ఆధునాతన హంగులతో, టెక్నాలజీతో బీర్ తయారీ కేంద్రం, వెజ్, నాన్‌వెజ్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సీడర్, వీట్, లాగర్, అలె వంటి నాలుగు రకాల బీర్లు లభిస్తాయన్నారు. ఎవరికీ ఏ బ్రాండ్ కావాలో దానిని అప్పటికప్పుడు తయారుచేసి ఇస్తామన్నారు. వెజ్, నాన్‌వెజ్ ఐటమ్స్, కాంటినెంటల్, ఇండియన్, ఇండియన్ చైనీస్, ఇటాలియన్ ఫుడ్ అందుబాటులో ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది రెండవ బ్రాంచ్ అని తెలిపారు. ఇలాంటి రెస్టారెంట్‌లు అమెరికా వంటి దేశాల్లో ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. విశాఖపట్నంలో మొదటి రెస్టారెంట్ ప్రారంభించగా ప్రజల నుండి స్పందన బాగుందన్నారు.