ఆంధ్రప్రదేశ్‌

ప్రజల భాగస్వామ్యంతో నాటుసారాకు అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీలేరు, మార్చి 9: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజల భాగస్వామ్యంతో నాటుసారా అరికడతామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి చిత్తూరు, కడప జిల్లాల ఎక్సైజ్ ఉన్నతాధికారులు, ఎక్సైజ్ సిబ్బంది 18 బృందాలుగా ఏర్పడి చిత్తూరు జిల్లాలోని పీలేరు మండలంలోని జిల్లేళ్లమంద తాండా గ్రామంలో, గ్రామ పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో సారారహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.పలుమార్లు నాటుసారా కేసుల్లో నిందితులపై పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తున్నామని, వారిపైన కఠినచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాలను సారారహిత జిల్లాలుగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించిందని వెల్లడించారు.