ఆంధ్రప్రదేశ్‌

ఎవరా ఇద్దరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 9: రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఇద్దరు బీజేపీ మంత్రులు నిష్క్రమించడంతో ఖాళీ అయిన ఆ రెండు పదవులు దక్కేదెవరికన్న చర్చ మొదలయింది. కామినేని ప్రాతినిధ్యం వహించిన వైద్య, ఆరోగ్యం, మాణిక్యాలరావు ప్రాతినిధ్యం వహించిన దేవదాయ ధర్మదాయ శాఖ కీలకం కావడంతో వాటిని వెంటనే భర్తీ చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. కొత్తగా ఇద్దరిని తీసుకుని, తర్వాత శాఖల మార్పు చేర్పులు చేసే అవకాశాలున్నాయని అటు పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామా చేసిన వెంటనే శాసనసభ, పార్టీ వర్గాల్లో కొత్తగా వచ్చే ఇద్దరు మంత్రులెవరన్న చర్చ మొదలయింది. బీజేపీ వైదొలగడంతో ముస్లిం మైనారిటీలు మళ్లీ టీడీపీ వైపు ఆకర్షితులవుతారన్న అంచనాతో ఉన్న నాయకత్వం, ఆ మేరకు ఒక ముస్లిం నేతకు రెండింటిలో ఒకటి కచ్చితంగా ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ ముస్లిం నేత, ఎమ్మెల్సీ ఎం.ఏ.షరీఫ్‌కు అవకాశాలు మెరుగ్గా ఉండవచ్చంటున్నారు. బాబుకు విధేయత, వివాదరహిత తీరు, రాష్ట్రంలో ముస్లిం వర్గాల సమస్యల పరిష్కారానికి తొలి నుంచి ప్రతినిధిగా వ్యవహరిస్తుండటం వంటి అంశాలు ఆయనకు ప్లస్ పాయింట్ కావచ్చంటున్నారు. రాజీనామా చేసిన మాణిక్యాలరావు కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నందున, అదే జిల్లాకు చెందిన షరీప్‌కు ఆ అంశం కలసిరావచ్చని విశే్లషిస్తున్నారు. కాగా రాజీనామా చేసిన మాణిక్యాలరావు కాపు వర్గానికి చెందినందున, ఆ పదవిని అదే సామాజికవర్గంతోనే భర్తీ చేసే అవకాశాలే మెండుగా ఉంటాయని చెబుతున్నారు. ఆ ప్రకారంగా కాపు వర్గాల్లో కీర్తి, వివాదరహితుడిగా పేరున్న మండలి బుద్దప్రసాద్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన బీజేపీ మంత్రి కామినేని కమ్మ వర్గానికి చెందినప్పటికీ, ప్రస్తుతం ఆ జిల్లా నుంచి దేవినేని ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్నందున, మళ్లీ మరొక కమ్మ నేతకు అవకాశం కల్పించే అవకాశాలు ఉండవంటున్నారు. ఆ ప్రకారంగా అదే జిల్లాకు చెందిన సీనియర్ కాపు నేత మండలి బుద్దప్రసాద్‌కే అవకాశం ఇవ్వడం ద్వారా, కాపు సామాజికవర్గాన్ని సంతృప్తి పరచవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పల్నాడు ప్రాంతంలో సీనియర్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన పేరు గత మంత్రివర్గంలో చివరి వరకూ వినిపించినా, సామాజిక సమీకరణల కారణంగా దక్కకుండాపోయింది. గతేడాది జరిగిన మంత్రివర్గ ప్రమాణస్వీకారం రోజున స్వయంగా చంద్రబాబునాయుడు నీకు కొన్ని సమీకరణల కారణంగా పదవి ఇవ్వలేకపోయానని చెప్పగా, తనకు పదవులు అవసరం లేదని, ఈ రాష్ట్రానికి మీరు సీఎంగా కొనసాగాలన్నదే తన కోరిక అని యరపతినేని బాబుకు మీడియా ముందే చెప్పిన విషయం తెలిసిందే. లోకేష్ సైతం యరపతినేనిని చూసి నేర్చుకోవలసింది చాలాఉందని, మంత్రిపదవి రాకపోయినా అన్న వచ్చారని ప్రశంసించారు. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్పించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం దానిని ప్రస్తావించి, యరపతినేనిపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, కమ్మ సామాజికవర్గం నుంచి ఈసారి అవకాశం కల్పిస్తారా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితిలో అలాంటి అవకాశాలు తక్కువేనని, ఆ వర్గం నుంచి అవకాశం కల్పిస్తే యరపతినేనికి ఖాయంగా అవకాశం లభిస్తుందని పార్టీ వర్గాలు విశే్లషిస్తున్నాయి.