అంతర్జాతీయం

మీరెంత వేస్తే.. మేమూ అంతే వేస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 9: అమెరికా విధిస్తున్న సుంకాలను మించిన స్థాయిలో పన్నులను విధిస్తే దానికి తగ్గట్టుగానే తాముకూడా భారత్, చైనాలపై పన్ను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో సుంకాలకు సంబంధించి ట్రంప్ తెగింపు ధోరణి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఈ తాజా ప్రకటన వెలువడం మరింత కలవరానికి కారణమైంది. అత్యధిక రేట్లు కలిగిన హార్లీ డేవిడ్‌సన్ వంటి మోటారు బైకులపై భారత్ 50 శాతం సుంకం విధించడాన్ని ట్రంప్ నిరసించిన విషయం తెలిసిందే. భారత్ నుంచి తాము దిగుమతి చేసుకున్న మోటారు బైకులపై ఎలాంటి పన్నూ విధించటం లేదని, అలాంటప్పుడు తమ దేశం నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యే వాహనాలపై ఈ సుంకం ఏమిటని ట్రంప్ నిలదీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీరెంత పన్ను వేస్తే మేమూ అంతే పన్ను వేస్తామన్న ప్రతిపాదనను ట్రంప్ తెరపైకి తెచ్చారు. చైనా తమ వస్తువులపై 25 శాతం పన్ను వేస్తే, అలాగే భారత్ 75 శాతం పన్ను విధిస్తే తాము కూడా అదే తరహాలో ఈ దేశాల నుంచి దిగుమతి చేసుకునే, లేదా తమ దేశానికి ఎగుమతి అయ్యే వస్తువులపై పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు. కెనడా, మెక్సికో వినా అన్ని దేశాల నుంచి ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై పన్ను విధిస్తున్నామని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ దేశాలు తమ వాహనాలపై 50శాతం సుంకం విధిస్తే 50 శాతం, 75 శాతం పన్ను విధిస్తే 75 శాతం తాముకూడా పన్ను విధిస్తామని ట్రంప్ తెలిపారు. దీనే్న పరస్పరం సరిసమాన రీతిలో సుంకాలను విధించుకోవడంగా ఆయన అభివర్ణించారు. ‘మా దేశం నుంచి దిగుమతి చేసుకునే వాహనాలపై ఇతర దేశాలు ఎంత పరిమాణంలో పన్ను వేస్తాయో, ఆ దేశాల నుంచి మేము దిగుమతి చేసుకునే వాహనాలపై అంతేశాతం పన్ను విధిస్తాం’ అని ట్రంప్ తేల్చి చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఈ పరస్పర పన్ను విధింపు అంశాన్ని అమలు చేయడానికి రంగాన్ని సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటివరకు అమెరికా కంపెనీల విషయంలో ఇతర దేశాలు ఎంతమాత్రం సమంజస రీతిలో వ్యవహరించలేదని ఆయన అన్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కార్లపై చైనా 25 శాతం సుంకం విధిస్తోందని, అదే చైనా నుంచి తాము దిగుమతి చేసుకునే కార్లపై 2.5 శాతం మాత్రమే పన్ను వేస్తున్నామని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సరిసమాన రీతిలో పరస్పరం పన్నులు విధించుకోవడం వల్ల నిష్పాక్షిక రీతిలో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తన ట్వీట్‌లో అనేకసార్లు చైనా గురించే ట్రంప్ ప్రస్తావించటం గమనార్హం.