రాష్ట్రీయం

సైబరాబాద్ కమిషనరేట్‌లో టాస్క్ఫోర్స్ టీమ్‌ల ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: సైబరాబాద్ కమిషనరేట్‌లో జనానాభాకు అనుగుణంగా పోలీసు సిబ్బంది లేదని, శాంతి భద్రతల దృష్ట్యా కమిషనరేట్ పరిధిలోని ఐదు టాస్క్ఫోర్స్ టీమ్‌లను ఎత్తివేసినట్టు సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సైబరాబాద్ పరిధి 65 లక్షల జనాభాతో 3700 స్కేర్ కి.మీటర్లుగా విస్తరించిందన్నారు. ఐటి కారిడార్ ఉన్నందున భద్రతా సిబ్బంది పెంచాల్సిన అవసరం ఉందన్నారు. 7,200 మంది సిబ్బంది అవసరం కాగా 5,200 మాత్రమే ఉన్నారన్నారు. ఐదు జోనల్ టాస్క్ఫోర్స్ టీమ్‌లను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా సైబరాబాద్‌లో పనిచేస్తున్న ఏడు సిసి పోలీసు స్టేషన్లను ఎత్తివేస్తున్నట్టు చెప్పారు. అల్వాల్, వనస్థలిపురం, మాదాపూర్, బాలానగర్, మల్కాజ్‌గిరి, ఎల్‌బి నగర్, శంషాబాద్ పోలీసు స్టేషన్లను ఎత్తివేయబడతాయి. లాఅండ్ అర్డర్ పోలీసు స్టేషన్ల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం ఎత్తివేస్తున్న పోలీసు స్టేషన్ల సిబ్బందిని లాఅండ్ అర్డర్ పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నామని కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు.