అంతర్జాతీయం

పాక్ ఉగ్రవాదులపై భారీ రివార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 9: ప్రముఖ పాకిస్తాన్ ఉగ్రవాదుల ఆచూకీ చెప్పిన వారికి పెద్ద మొత్తంలో రివార్డులను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తెహ్రిక్ ఇ పాకిస్తాన్ అధినేత వౌలానా ఫజలుల్లాపై 5 మిలియన్ అమెరికన్ డాలర్లు, జమాత్ ఉల్ ఆహ్రర్‌కు చెందిన అబ్దుల్ వలి, లష్కర్ ఎ ఇస్లామ్‌కు చెందిన మంగల్ టాగ్ పై చెరో 3 మిలియన్ డాలర్ల చొప్పున రివార్డులు ప్రకటించారు.
ఫజలుల్లా నిషిద్ధ తెహ్రీక్-ఎ- తాలిబాన్ పాకిస్తాన్ సంస్థకు అధినేత. 2014లో పెషావర్ పాఠశాలలో విద్యార్థులతో సహా 150 మంది హత్యకు ఇతడే కారకుడని నమ్ముతున్నారు. పాకిస్తాన్‌కు చెందిన పాఠశాల విద్యార్థిని మలాలా యూసుఫ్ జాయ్‌ను హత్యచేయాలని 2012లో ఆదేశాలు ఇచ్చింది కూడా ఇతడే. అయితే ఫజలుల్లా తనయుడు, డ్రోన్ దాడిలో మరణించినట్టు యుఎస్ ఆంతరంగిక భద్రతాశాఖ ప్రకటించింది. ఇక తెహ్రిక్ ఇ తాలిబాన్‌నుంచి విడివడి, జమాత్ ఉల్ అహ్రర్ ఏర్పడింది. వలీ నేతృత్వంలో ఈ సంస్థ పంజాబ్ ప్రావెన్స్‌లో చురుగ్గా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 2016లో ఈ సంస్థకు చెందిన ఉగ్రవాది లాహోర్ పబ్లిక్ పార్కులో ఆత్మాహుతికి పాల్పడటంతో 75 మంది మరణించగా 340 మంది గాయపడ్డారు. 2015 ఆగస్టులో పంజాబ్ హోం మంత్రి షుజా ఖంజడా, అతని 18 మంది మద్దతు దార్లను ఆత్మాహుతి దాడిలో పొట్టనపెట్టుకుంది కూడా ఈ సంస్థే. వలి మరోపేరు ఒమర్ ఖలీద్ ఖొరాసని. పాకిస్తాన్‌లోని మహమ్మద్ ఏజెన్సీలో జన్మించిన వలి, పూర్వాశ్రమంలో జర్నలిస్టు, మంచి కవి. కరాచీలోని అనేక మదరసాల్లో చదువుకున్నాడు. లష్కర్ ఎ ఇస్లాం, పాకిస్తాన్ గిరిజన ప్రాంతానికి చెందిన సంస్థ. దీని అదినేత మంగల్ బాగ్, మత్తుమందుల రవాణా, కిడ్నాప్‌లు, నాటో కాన్వాయ్‌లపై దాడులు వంటి ద్వారా ఆదాయం పొందుతున్నాడు. వైట్ హౌజ్ అధికార్లతో, పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్‌మినా జన్జువా చర్చలు జరిపిన తర్వాత ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.