బిజినెస్

స్టాక్స్ అంటేనే బెంబేలెత్తిపోతున్న ఎఫ్‌పిఐలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: స్టాక్ మార్కెట్లంటేనే విదేశీ మదుపరులు బెంబేలెత్తిపోతున్నారు. కొత్త పెట్టుబడులకు ససేమిరా అంటున్నారు. గతంలో పెట్టిన పెట్టుబడులనూ ఉపసంహరించుకుంటున్నారు. అవును.. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం అంచనాల మధ్య భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు మరి. గడచిన రెండు వారాల్లో 2,254 కోట్ల రూపాయల పెట్టుబడులను గుంజేసుకున్నారు. అయితే ఇదే సమయంలో రుణ మార్కెట్లలోకి 962 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. డిపాజిటరీలు అందించిన సమాచారం మేరకు ఈ నెల 1-12 మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు 2,254 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే రుణ మార్కెట్లలోకి 962 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు. దీంతో 1,292 కోట్ల రూపాయల పెట్టుబడులు దేశీయ మార్కెట్ల నుంచి ఈ నెలలో తరలిపోయినట్లైంది. ఇక గత నెల జనవరిలోనైతే ఎఫ్‌పిఐలు.. స్టాక్ మార్కెట్ల నుంచి 13,381 కోట్ల రూపాయల పెట్టుబడులను తిరిగి తీసేసుకున్నారు. అయితే రుణ మార్కెట్లలోకి మాత్రం 3,274 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. దీంతో ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల కంటే రుణ మార్కెట్లలో పెట్టుబడులకే విదేశీ మదుపరులు ఆసక్తి కనబరుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. ‘అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పతనమవడం, చైనా ఆర్థిక వ్యవస్థలో మందగమనం ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఇందులో భారత్ కూడా నష్టపోతోంది.’ అని జియోజిత్ బిఎన్‌పి పరిబాస్ ఫండమెంటల్ రిసెర్చ్ అధిపతి వినోద్ నాయర్ అన్నారు. ప్రధాన సంస్థల ఆర్థిక ఫలితాలు నిరాశ కలిగించడం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనానికి ఉన్న అవకాశాలు మదుపరుల పెట్టుబడుల ఆసక్తిని దెబ్బతీశాయని హెమ్ సెక్యూరిటీస్ డైరెక్టర్ గౌరవ్ జైన్ అన్నారు.
గడచిన రెండు వారాల్లో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ దాదాపు 1,900 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సుమారు 600 పాయింట్లు కోల్పోయినది తెలిసిందే.