హైదరాబాద్

సగరులలో సామాజికశక్తి పెరిగితేనే రాజకీయశక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: భారతదేశ చరిత్రలో సగరులకు ఎంతో ప్రాముఖ్యత ఉందనీ మహాకవి జాషువా తలచుకున్నది మొదట సగరులను అని, గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుడు సగరుడని ముఖ్యమంత్రి కార్యాలయ డిఎస్‌డి దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆదివారం ఉదయం జరిగిన అఖిలభారత సగర మహాసభకు దేశపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భూమిపై నీటి వినియోగాన్ని కనుగొన్న శాస్తవ్రేత్తలు సగరులు, చెకుముకురాయి ద్వారా నిప్పు పుట్టించినది సగరులు.. సర్ట్ఫికేట్ లేని చదువులతో మేధావులు తాపీమేస్ర్తీ అని అన్నారు. సగరులలో కూలీపని చేసే వారికి రక్షణ పరికరాలు అందించాలని, సగరులను నాయకులుగా ఎదగడానికి అవకాశం కల్పించాలని తదితర డిమాండ్‌లతో వినతిపత్రాన్ని తనకు ఇచ్చారని, వీలు చూసుకుని ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సంప్రదిస్తానని దేశపతి హామీ ఇచ్చారు. కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాల హరికిషన్ అధ్యక్షత వహించారు. సగరులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరాలని ఆయన అన్నారు. ఇంటర్, పదవ తరగతిలో అత్యధిక మార్కులు సంపాదించిన భవాని, కీర్తన, సూర్యసాగర్‌లకు బంగారు పతకాలు ప్రదానం చేశారు.