AADIVAVRAM - Others

తెలుగు జాతీయాలు .. కరణం దస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రామంలోని ప్రజల ఆస్తిపాస్తులకు కరణీకం చేసే వ్యక్తి కరణం. ఆ కరణానికి కొడుకు, కోడలుండేవారు. తన తరువాత ఒకడే దస్త్రం కట్టవలసి ఉంటుంది. కొడుకు లెక్కలు వ్రాయుట భూముల వివరాలు చెప్పుట మొదలెట్టాడు. కొన్ని రోజుల తరువాత ఆ కొడుకు విసిగిపోయి తలకట్టు కొన్నాడు. తలకట్టుకొనుట అంటే భీష్మించుకొనుట.
అతనికి ఓ ఆవు ఉన్నది. ఆ ఆవు ఒక పెయ్య వేసింది. ఆ పెయ్య అటు నిటు గంతులు వేస్తుంది. ఈ గంతులు వేయుటను కోడలు ఓ మాట అన్నది. ‘ఓహో! పెయ్య నీకు సాయంకాలము దస్త్రం మెడలో కట్టేస్తాలే’ అని అంది. ఆ మామయ్య అవాక్కయ్యాడు. కొడుకు దస్త్రంకు సంబంధ విద్యను వాయిదా వేశాడని ఒక కథ ఉంది. కదలడానికి, మెదలడానికి వీలుకాకుండా కాళ్లకు బంధం వేసినట్లు, మూతికి బుట్టి కట్టినట్లు, నడుములు విరిగేటట్లు కూర్చున్న పాట్లు మెడ పట్టినట్లు వేధించే వాటి కొరకు ‘కరణము దస్తమ్రు’ అంటారు. భర్త పనిని, బాధాకరమైన కార్యము, స్వాతంత్య్రం లేని చాకిరి మొదలైన అర్థ విశేషాలకు ఈ జాతీయము వాడుతారు.

-యం.వి.నర్సింహారెడ్డి *