విశాఖపట్నం

స్పినే్నశారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 14: వైఎస్సార్ విడిసిఎ - ఎసిఎ స్టేడియంలో మరో సారి భారత్ క్రికెట్ జట్టు జయకేతనం ఎగురవేసింది. ఇప్పటి వరకూ ఈ స్టేడియంలో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోను భారత్ విజయం సాధిస్తూ వచ్చింది. ఇదే స్టేడియంలో ఆదివారం జరిగిన టి-20 మ్యాచ్‌లో భారత్ గెలుపొందడం ద్వారా తన విజయాల పరంపరను కొనసాగించింది. ఇప్పటికే 1-1తో సిరీస్ సమం చేసిన భారత్, చివరి మ్యాచ్‌లో విజయం ద్వారా సిరీస్‌తో పాటు ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. దాదాపు ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం ఆరు ఓవర్లకు ముందే పూర్తి కావడం గమనార్హం. ఇరు జట్లు కలిసి 40 ఓవర్లు ఆడాల్సి ఉండగా కేవలం 31.5 ఓవర్లలోనే ముగియడంతో క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎంతో ఉత్కంఠత కనబరచిన ప్రేక్షకులు శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ల వికెట్లు పడిపోగా, తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు సైతం క్రీజులో నిలదొక్కుకోలేక పోయారు. ఇక భారత్ బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ హిట్టింగ్ చూడాలనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. కేవలం 13 పరుగులకే రోహిత్ పెవిలియన్‌కు చేరుకోగా శిఖర్ ధావన్, అజ్యింక రహానే మ్యాచ్‌ను ముగించేశారు. దీంతో ధోనీ, రైనా, యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌లో మెరుపులు చూద్దామనుకున్నా అవకాశం దక్కలేదు.

వైభవంగా
శ్రీశారదాపీఠం వార్షికోత్సవం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 14: చినముషిడివాడ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, దీక్షా ధారణతో కార్యక్రమం మొదలైంది. సినీనటుడు నందమూరి బాలకృష్ణ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నిష్ణాతులైన పండితులచే గణపతి హోమం, చతుర్వేత సంహిత యాగం, స్కంధయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. హిందూధర్మ పరిరక్షణకై స్వామివారు చేస్తున్న కృషిని అభినందించారు. లోకకల్యాణార్థం విశాఖ శారదాపీఠం అధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెసుకున్నానని, అయితే స్వయంగా పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు. గ్రహదోషాలు ఎక్కువగా ఉన్న ఈ కాలంలో దైవానుగ్రహం కోరుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం లోకకల్యాణంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఐఎఎస్ అధికారి ఎల్‌వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ లోకకల్యాణం కోసం స్వరూపాస్వామి చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా దేశం,రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తూ సినీ హీరోగా ఖ్యాతి గాంచిన బాలకృష్ణ ఒక ఆధ్యాత్మిక వేత్తగా, బసవరామ తారకం ట్రస్టు నిర్వహణ ద్వారా ఒక సామాజిక కార్యకర్తగా సేవలందించడం హర్షణీయమన్నారు. అనంతరం భక్తులకు స్వామి వారు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, వెలగపూడి రామకృష్ణబాబు, పీలా గోవింద్, ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొన్నారు.
స్మార్ట్ విశాఖ ఇంకెంత దూరం?
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 14: స్మార్ట్‌సిటీగా విశాఖ నగరం రూపుదిద్దుకునేందుకు ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలో. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఆదేశాధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌లో మూడు ప్రధాన పట్టణాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. గతేడాది జనవరిలో ఇరు దేశాధినేతలు ఒకే వేదికపై నుంచి విశాఖ స్మార్ట్‌సిటీని ప్రకటించారు. అయితే స్మార్ట్‌సిటీ రూపలక్పనకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని విధాలా సహకారం అందించేందుకు అమెరికా ప్రభుత్వం యునైటెడ్ స్టేట్ ట్రేడ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (యుఎస్‌టిడిఎ)కి బాధ్యతలు అప్పగించింది. ఇది జరిగి దాదాపు 13 నెలలు కావస్తోంది. అప్పటి నుంచి యుఎస్‌టిడిఎ విశాఖ స్మార్ట్‌సిటీ ప్రతిపాదలను తయారు చేసేందుకు మూడు సంస్థలను ఎంపిక చేసింది. ఎయికాం, ఐబిఎం, కెపిఎంజి సంస్థలు విశాఖ భౌగోళిక, వాస్తవ పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, సమగ్ర పథక నివేదిక అందించాల్సి ఉంది. దీనికి అవసరమైన ఆర్థిక సాయం యుఎస్‌టిడిఎ అందజేస్తుంది. నిరంతర నీటి సరఫరా, విద్యుత్, ఘన వ్యర్థాలు, మురునీటి పారుదల వ్యవస్థల నిర్వహణ, పర్యావరణ హిత రవాణా వ్యవస్థ రూపకల్పన, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, సేఫ్టీ, సెక్యూరిటీ తదితర అంశాలపై యుఎస్‌టిడిఎ అనుమతించిన మూడు కంపెనీలు సమగ్ర పథక నివేదిక (డిపిఆర్)లు సమర్పించాల్సి ఉంది. స్మార్ట్‌సిటీ రూపకల్పనకు సంబంధించి ఐబిఎం, కెపిఎంజి, ఎయికాం సంస్థలు డిపిఆర్‌లకు రూపకల్పన చేయడంతో పాటు అందుకు అవసరమైన నిధుల లభ్యతపై కూడా సూచనలు చేస్తాయి. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకోసం ఎదురు చూడకుండా, సొంతంగా నిధులను సమకూర్చుకునే మార్గాలను కూడా ఈ సంస్థలు సూచిస్తాయి. దీనిలో అగ్రభాగం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) విధానంలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా స్మార్ట్‌సిటీ ప్రణాళిక రూపకల్పన విషయంలో గత ఏడాది కాలంగా జరుగుతున్న విస్తృత కసరత్తు ఒక ఎత్తయితే భవిష్యత్‌లో ఎంపిక చేసిన సంస్థలు డిపిఆర్‌లు తయారు ఇచ్చే నివేదికలపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం జివిఎంసికి ఎన్నికైన పాలకవర్గం లేకపోవడంతో అధికారులే అంతా తామై నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారుల నివేదిక మేరకు ప్రభుత్వం కూడా తన అంగీకారం తెలుపుతూ వస్తోంది. జివిఎంసికి ఎన్నికలు జరిగి, పాలకవర్గం ఏర్పడితే ప్రతి అంశాన్ని కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంశాలపై చర్చ అనంతరం మెజార్టీ సభ్యులు నిర్ణయాలను ఆమోదించాల్సి ఉంటుంది. పిపిపి ప్రాజెక్టులు, ఆస్తుల బదలాయింపు తదితర అంశాలపై పాలకవర్గం నిర్ణయమే శిరోధార్యమవుతుంది. యుఎస్‌టిడిఎ ఎంపిక చేసిన సంస్థల డిపిఆర్‌లపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ జోక్యం అధికమైతే నివేదికలు కార్యరూపం దాల్చేందుకు ఇంకెంతకాలమైనా పట్టొచ్చు. ఇదే జరిగితే విశాఖ స్మార్ట్‌సిటీ కల సాకారం కావాలంటే దశాబ్ధాలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు.
నిజమైన భారతదేశం గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రతిబింబిస్తుంది
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 14: నిజమైన భారత దేశం గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రతిబింబిస్తుందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ అన్నారు. గ్రామీణ విద్యార్థుల్లో మానవీయ విలువలను పెంపొందించేందుకు కృషి చేయాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు. సత్యసాయి విద్యా సంస్థల జాతీయ సదస్సు ఇక్కడి గీతం విశ్వవిద్యాలయం ఆవరణలో ఆదివారం ముగిసింది. ముగింపు వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మానవతా విలువలతో కూడిన విద్యను అందించాల్సి ఉందని తెలిపారు. ఈ దిశగా సత్యసాయి విద్యా సంస్థలు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యా, వైద్య రంగాల్లో సత్యసాయి సంస్థలు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అని విలువలను బోధించే విద్య నేటి తరానికి అవసరమన్నారు. నైతిక విలువలతోనే ఇతరలకు మనుషులకు తేడా గుర్తించగలమన్నారు. ఈ దిశగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి మరో 10 మంది విద్యార్థులను ఈ దిశగా ప్రభావితం చేస్తే, సమాజానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా భగవాన్ సత్యసాయిలో ఆయన తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. భగవాన్ ఎప్పటికీ మనల్ని ఆశీర్వదించుగాక అంటూ ఏర్పాటు చేసిన బ్యానర్‌పై గవర్నర్ నరహింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ సంతకాలు చేశారు. సత్యసాయి సేవా సంస్థల అఖిల భారత అధ్యక్షుడు నిమిష్ పాండ్యా సత్యసాయి సేవా సంస్థల కార్యకలాపాలను వివరించారు. దాదాపు 102 విద్యా సంస్థల ద్వారా ఉత్తమ బోధన అందిస్తున్నామని తెలిపారు. 3.5 లక్షల బాలవికాస్ స్టూడెంట్స్, 12 లక్షల సేవాదళ్ ఉందని వివరించారు.
విద్య, వైద్యం, తాగునీటి అవసరాలను తీర్చేందుకు కోట్లాది రూపాయలను తమ సంస్థల ద్వారా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. భారత విద్యా వ్యవస్థలో కనుమరుగువుతున్న విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు, విలువలతో కూడిన విద్యను అందించేందుకు ఒక అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సత్యసాయి కేంద్రీయ ట్రస్టు ట్రస్టీ కె.చక్రవర్తి మాట్లాడుతూ సత్యసాయి విద్యా సంస్థల్లో విలువలతో కూడిని విద్యను అందించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని కమిటి సభ్యులను కోరారు. సత్యసాయి విద్యా వాహిని డైరెక్టర్ సత్యజిత్ మాట్లాడుతూ విద్యా బోధనలో మెరుగైన విధానాలు అమలు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టీలు ఆర్‌జె రత్నాకర్, కె.చక్రవర్తి, ఎస్.ఎస్.నాగానంద్, మాజీ డిజిపి హెచ్.జె.దొర. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జి చలం, విశాఖ నగర పోలీస్ కమిషనర్ అమిత్ గర్గ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. భగవాన్ సత్యసాయి వారసత్వాన్ని కొనసాగించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు.

దైవారాధనతోనే గుండె నిబ్బరం
సింహాచలం, ఫిబ్రవరి 14: దైవారాధనతో ధైర్యం చేకూరుతుందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఐఎల్ నరసింహన్ అన్నారు. ఆదివారం ఆయన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. రథంపై పూజలందుకుంటున్న శ్రీమన్నారాయణుడి దర్శనం కూడా చేసుకున్నారు. ఈ సందర్భంగా కలసిన విలేఖరులతో ఆయన మాట్లాడారు. నరసింహస్వామి ఉన్నచోట భయానికి తావులేదని, భక్తితో భగవంతుడిని సేవించి తరించాలని ఆయన అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు నరసింహన్ చెప్పారు. అంతకుముందు ఆలయంలో నరసింహన్ దంపతులు కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో నరసింహన్ పేరిట అర్చకులు సంప్రదాయ పూజలు చేశారు. ఆస్థాన మండపంలో వేద మంత్రోచ్ఛరణలతో అర్చకులు గవర్నర్‌ను ఆశీర్వదించారు. ఈవో రామచంద్రమోహన్ గవర్నర్‌కి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. డిసిపి రామ్‌గోపాల్ నాయక్, ఎసిపిలు భీమారావు, కింజరాపు ప్రభాకరరావు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.

సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఒక్కటే మార్గం
విశాఖపట్నం, ఫిబ్రవరి 14: సంపూర్ణ ఆరోగ్యానికి యోగా చక్కటి సాధనమని, ప్రశాంత జీవితానికి ఇదొక ఆధారమని యోగాచార్యులు శంకర గురూజీ అన్నారు. రథసప్తమి సందర్భంగా ఆదివారం ఉదయం సూర్యోదయ సమయంలో తెనే్నటిపార్కు వద్ద నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సూచనలు చేశారు. దీనివల్ల అనేక రుగ్మతులను సైతం పారదోలవచ్చన్నారు. మానసిక, శారీరక స్థితులను సమతుల్యతలో ఉంచుతూ వత్తిళ్ళను జయిస్తూ ఆరోగ్యకరమైన, ప్రశాంత జీవితం గడపటానికి యోగా ఒక అద్భుత సాధనంగా ఆయన పేర్కొన్నారు. శ్రీ నవ చైతన్య యోగా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ శంకర గురూజీ అధ్యక్షతన రవిశంకర్ రామేశ్వరరావుల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వంద మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. వీరంతా సూర్యోదయ సమయంలో ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుని స్తుతిస్తూ సూర్య నమస్కారాలు చేశారు.

జాతీయ స్థాయి టెన్నికాయిట్ ఓవరాల్ చాంపియన్ తమిళనాడు
గోపాలపట్నం, ఫిబ్రవరి 14: గ్రేటర్ విశాఖ నగరం 68వ డివిజన్ పరిధి గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన 40వ జాతీయ స్థాయి టెన్నికాయిట్ చాంపియన్‌షిప్ 2015 పోటీల్లో తమిళనాడు బాల బాలికల జట్లు ఓవరాల్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకున్నాయి. ఈ నెల 10 నుంచి ఇక్కడి హైస్కూల్ క్రీడా మైదానంలో ప్రారంభమైన సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ టెన్నికాయిట్ పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. 23 రాష్ట్రాలకు చెందిన జట్లు గత నాలుగు రోజులుగా హోరాహోరిగా ఎంతో ఉత్కంఠగా పోటీలు జరిగాయి. అన్ని విభాగాల్లో తమిళనాడు జట్లు అజేయంగా నిలిచి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాయి. ముఖ్య అతిథిగా నగర జాయింట్ కలెక్టర్ నివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, తదితరులు సంయుక్తంగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.
విజేతలు: పురుషుల టీమ్ చాంపియన్‌షిప్‌లో కేరళ విన్నర్స్ కాగా రన్నరప్‌గా తమిళనాడు క్రీడాకారుడు. స్ర్తిల టీమ్ చాంపియన్‌షిప్‌లో తమిళనాడు క్రీడాకారిణి విన్నర్ కాగా, కేరళ క్రీడాకారిణి రన్నరప్‌గా నిలిచారు. మెన్ సింగిల్ చాంపియన్‌గా తమిళనాడుకు చెందిన కె అరివాజన్ విన్నర్ కాగా పాండిచ్చేరికి చెందిన క్రీడాకారుడు కె గోవిందరాజన్ రన్నరప్‌గా నిలిచారు. ఉమెన్ సింగిల్ చాంపియన్‌గా తమిళనాడుకు చెందిన అరమ్య విన్నర్ గాగా కేరళకు చెందిన అమృత రన్నరప్‌గా నిలిచారు. మెన్ డబుల్స్‌లో కేరళకు చెందిన సంతోష్ కుమార్, లక్ష్మణ్ విన్నర్స్ కాగా, తమిళనాడుకు చెందిన శీలం బరసన్, జేసుదాస్ రన్నరప్‌గా నిలిచారు. ఉమెన్ డబుల్స్‌లో తమిళనాడుకు చెందిన కీర్తన, ఐశ్వర్య విన్నర్స్ కాగా, కేరళకు చెందిన షాన్‌ఫ్రీక్, ఐశ్వర్య రన్నరప్‌గా నిలిచారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో కేరళకు చెందిన మణికంథన్, అనూజ విన్నర్స్ కాగా తెలంగాణాకు చెందిన కె రంజిత్, శిరీష రన్నరప్‌గా నిలిచారు.

సాంస్కృతిక కళలంటే
ఎంతో ఇష్టం
ఆరిలోవ, ఫిబ్రవరి 14: సాంస్కృతిక కళలంటే తనకెంతో ఇష్టమని ముఖ్య అతిథి, తమిళనాడు గవర్నర్ కె రోశయ్య అన్నారు. ఆంధ్రా మ్యూజిక్ అకాడమీ అయిదు రోజుల పాటు నిర్వహించిన అకాడమీ 16వ వార్షిక సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆదివారం సాయంత్రం ముగింపు సభ జరిగింది. పూజ్య గురువు, సద్గురు కందుకూరి శివానందమూర్తి ఆశీస్సులతో ప్రారంభించిన అకాడమీ సేవలను కొనసాగించాలని ఆయన అన్నారు. దేశ విదేశాలలో ఖ్యాతినార్జించిన సంగీత కళాకారిణి కన్యాకుమారిని సత్కరించడం ముదావహమన్నారు. ఖాళీ సమయంలో మానసిక ప్రశాంతతకు సాహితీ విలువలున్న ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటుంటానన్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత వయొలిన్ విద్వన్మణి, పద్మశ్రీ, కళైమామణి ఎ కన్యాకుమారిని ‘సంగీత విద్యానిధి’ బిరుదుతో సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం, ప్రఖ్యాత గాయకుడు, నటుడు డాక్టర్ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం ఆమెను శాలువ, జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎల్‌వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మనం సంగీతంలో వెనుకబడి ఉన్నామన్నారు. సంగీతం పట్ల మరింత అభిరుచి పెరగాలన్నారు. గురుదేవులు సద్గురు కందుకూరి శివానందమూర్తి సంస్కృతి, సంప్రదాయాల అభివృద్ధికి కృషి చేసే సంస్థల నిర్వాహకులను, కళాకారులను ప్రోత్సహించేవారన్నారు. గాయకుడు, నటుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంగీతం, భక్తి, సాహిత్య సంబంధ సంస్థలను, వ్యక్తులను సద్గురు శివానందమూర్తి ప్రోత్సహించేవారన్నారు. కార్యక్రమంలో ఆంధ్రా మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ప్రభాకర్, కార్యదర్శి పివిఎస్ శేషయ్య శాస్ర్తీ పాల్గొన్నారు. డాక్టర్ జి ప్రభాకర్ వందన సమర్పణ చేశారు. అనంతరం పద్మశ్రీ, కళైమామణి, సంగీత విద్యానిధి అవసరాల కన్యాకుమారి వయొలిన్ కచేరి నిర్వహించారు. కృతులు, కీర్తనలను వయొలిన్‌పై ఎం రాజీవ్, మృదంగంపై ప్రతి సతీష్‌కుమార్ చక్కని లయవాద్య సహకారమందించి కచేరీని రక్తికట్టించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న సంగీతప్రియులు ఆద్యంతం కృతులు, కీర్తనలను ఆసక్తిగా విన్నారు.

చట్ట సవరణలతో యాజమాన్యాలకే మేలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 14: చట్ట సవరణలు చేయడం వలన కార్మికలోకానికి ఒరిగేదేమీ లేకపోగా పరిశ్రమల యాజమాన్యాలకు మేలు చేసేవిగా ఉంటున్నాయని ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి అన్నారు. నగరంలోని ఒక హోటల్లో ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులకు అనుకూలంగా ఉండే చట్ట సవరణలు చేస్తే అభ్యంతరాలు ఉండేవి కాదని, అయితే వీరికి తీరని అన్యాయం చేసే విధంగా యాజమాన్యాలకు కొమ్ముకాసే విధంగా ఇవి ఉన్నాయన్నారు. చట్ట సవరణలతో యాజమాన్యాలకు స్వేచ్ఛ ఉంటే కార్మికులకు సమ్మె చేసే అవకాశం ఉండదన్నారు. సమ్మె చేసినట్లైతే ఐదు లక్షలు జరిమానా, ఐదేళ్ళపాటు శిక్షను అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇది ఏకపక్షంగా ఉన్న చట్ట సవరణగా ఆయన పేర్కొన్నారు. అలాగే చట్ట సవరణతో జీవితాంతం తాత్కాలిక కార్మికునిగానే ఉండిపోయే ప్రమాదం ఉందన్నారు. అప్రంటీస్‌యాక్ట్‌ను సవరించారని, కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నా కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. దొడ్డిదారిన చట్టం చేయడం ప్రారంభించిందన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో కార్మిక వ్యతిరేక చట్టాలను సవరిస్తూ తీసుకున్న నిర్ణయంతో కార్మికలోకం నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చేందుకు హక్కుల రక్షణ కోసం వచ్చేనెల 10వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన దినం పాటిస్తున్నామన్నారు. అలాగే ఏప్రిల్ 11వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ఆయన ప్రకటించారు. రైల్వే, రక్షణ రంగ కార్మికులు చేపట్టనున్న సమ్మెను ఐఎన్‌టియుసి బలపరుస్తుందన్నారు. ఐఎన్‌టియుసి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఐఎన్‌టియుసి అఖిలభారతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్, ఏపీ రాష్ట్ర ఇంటక్ చీఫ్ వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ కెఎస్ మోహన్‌కుమార్, చీఫ్ వైస్-ప్రెసిడెంట్ గడసాల అప్పారావు, జిల్లా ఐఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి భోగవల్లి నాగభూషణం, ప్రధాన కార్యదర్శి నీరుకొండ రామచంద్రరావు, గందం వెంకటరావులు పాల్గొన్నారు.

కాటేసిన మృత్యువు!
యలమంచిలి రూరల్, పిబ్రవరి 14:మండలంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో విషాదం నింపింది. విధి వక్రీకరించిందో..‚ డ్రైవర్ నిర్లక్ష్యమో‚ తెలియదు. ఎర్రవరం సమీపంలో అంబులైన్సు బోల్తాపడిన ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రగాయల పాలయ్యారు. అంబులైన్సు డ్రైవర్లులో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఆదివారం జరిగిన దుర్ఘటన పలువురిని కలచివేసింది. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్‌కు చెందిన నిరంజన్ గిరి హైదరాబాద్ ఆసుపత్రిలో మృతి చెందారు. మృతదేహంతో అంబులైన్సులో వారు స్వగ్రామానికి బయలుదేరారు. యలమంచిలి సమీపంలో అంబులైన్సు అతివేగంతో అదుపుతప్పి గోతిలో పడి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నిరంజన్ గిరి భార్య పవిత్ర గిరి, కుమారుడు రవికుమార్, కుమార్తె మణితి, డ్రైవర్ వెంకట రమణలు మృతి చెందారు. కోడలు స్వర్ణలత, ద్వితీయ కుమారుడు సీతారామ్, మనమరాళ్లు మమత, నమతలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన యలమంచిలి, కశింకోట 108ల్లో యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. అంబులైన్సు ముందుభాగం నుజ్జు నుజ్జు అవడంతో మృతదేహాలు, క్షతగాత్రులు ఇరుక్కు పోయారు. యలమంచిలి పోలీసులు సహాయంతో ట్రాఫిక్ ఎస్‌ఐ రోహిణిపతి బయటకు తీయించారు. యలమంచిలి సిఐ కె. వెంకట్రావు సంఘటన స్థలం చేరుకొని పొక్లైన్ సహాయంతో అంబులైన్సును పైకి తీయించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు.
మరో ఇద్దరు
మండలంలోని పెదపల్లిలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాద వివరాలు ఇలావున్నాయి. యలమంచిలికి చెందిన చేబ్రోలు ప్రభాకరరావు(55) పెదపల్లిలో నుండి బైక్‌పై జాతీయ రహదారిని దాటుతుండగా అనకాపల్లి నుండి తుని వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రభాకరరావు అక్కడికి అక్కడే వృతి చెందాడు. పురుషోత్తపాలెం వద్ద జాతీయ రహాదారిపై ఆదివారం రాత్రి నడిచి వెలుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో
పాదచారి అక్కడికి అక్కడే మృతి చెందాడు. దీనిపై యలమంచిలి రూరల్ ఎస్‌ఐ సిహెచ్. వెంకట్రావు కేసులు నమోదు చేసి దర్వాప్తు చేస్తున్నారు.

అయ్యో పాపం... !
యలమంచిలి, పిబ్రవరి 14: ముక్కుపచ్చలారని పసిబాలుడు బుడిబుడి అడుగులు వేయాల్సిన వయస్సులో రోడ్డు ప్రమాదంలో మృత్యువుఒడిలోకి చేర్చింది. ఆదివారం జరిగిన అంబులైన్సు ప్రమాదంలో నిరంజన్ గిరి మనుమడు జాగా మృతి పలువురిని కలచివేసింది. శిశువు తండ్రి ప్రమాదంలో అక్కడికి అక్కడే మృతి చెందగా తల్లి కొన ఊపిరితో మృత్యువుతో పోరాడుతుంది. 108లో జాగా మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తండ్రి, తల్లి అయిన వాళ్లు ఎవరు లేకపోవడంతో దొండ పండులాంటి శిశువును చూసి పలువురు దిగ్భ్రాంతి చెందారు. అనాదిగా ఆసుపత్రిలో ఉన్న శిశువు మృత దేహంను చూసినవారికి అయ్యోపాపం అని పించింది.

పీలాకు త్రుటిలో తప్పిన ప్రమాదం

అనకాపల్లిరూరల్, ఫిబ్రవరి 14: అనకాపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు ఆదివారం త్రుటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సినీనటుడు బాలకృష్ణను కలిసి వస్తున్న ఎమ్మెల్యే పీలాగోవిందసత్యనారాయణ అనకాపల్లి మండలం సిరసపల్లి గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ఆటో అదుపుతప్పి ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం వెనుకభాగంగా ద్వంసమైంది. వాహనంలో ఎమ్మెల్యేతోపాటు తెలుగుయువత అధ్యక్షులు మళ్ల సురేంద్ర, డిసిసిబి డైరక్టర్ సిదిరెడ్డి శ్రీనివాసరావు, తెలుగుయువత నాయకులు మలసాల కుమార్‌రాజా, బాలకృష్ణ అభిమానులు ఉన్నారు. ఆటో డీ కొట్టడంతో ఎమ్మెల్యేతో పాటు అందరూ ఒక్కసారిగా హుళిక్కిపడి షాక్‌కు గురయ్యారు. ఆ క్షణంలో ఎంజరిగిందో ఎవరికీ తెలియకుండా పోయింది. ఎమ్మెల్యే వాహనంలో ప్రయాణిస్తున్న ఫ్రోటోగ్రాఫర్ రవ్వా శ్రీనివాసరావుకు స్వల్పగాయం తప్ప ఎవరికీ ఏమికాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వాసులు ఎమ్మెల్యే పీలా ఆరోగ్యపరిస్థితిపై అడిగితెలుసుకున్నారు.

త్వరితగతిన రుణాల మంజూరు
చోడవరం, ఫిబ్రవరి 14: ఖరీఫ్ సీజన్ నుండి రైతాంగానికి తక్కువ సమయంలో రుణ సదుపాయాన్ని కల్పిస్తామని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ సుకుమార వర్మ హామీ ఇచ్చారు. ఆదివారం మండలంలోని గోవాడ పిఎసిఎస్‌లో సభ్యరైతులకు వివిధ పధకాల ద్వారా సుమారు మూడులక్షల రూపాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వాణిజ్య బ్యాంక్‌లకు ధీటుగా పిఎసిఎస్‌లను తీర్చిదిద్దుతున్నామన్నారు. సంఘాలు ఆర్థికంగా బలపడేందుకు పరపతేతర వ్యాపారాలను సాగించడం ద్వారా పిఎసిఎస్‌లను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసరావు, పిఎసిఎస్ అధ్యక్షులు శానాపతి సత్యారావు, బీరా సత్యారావు పాల్గొన్నారు.
రైవాడ నీటిపై జివిఎంసి పెత్తనం ఏమిటి?
దేవరాపల్లి, ఫిబ్రవరి 14: రైవాడ నీటిపై కార్పొరేషన్‌కు పెత్తనం ఏమిటని సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ నరిశింగరావు ప్రశ్నించారు. ఆదివారం రైవాడ లింక్ కెనాల్ వద్ద పాదయాత్ర ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేస్తే రైవాడ నీరు రైతులకు అందుతుందన్నారు. కార్పొరేషన్ బకాయిపడ్డ రూ.112 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైవాడ నీటిపై జివియం పెత్తనం ఏమిటని దీనిపై రైతులు తేల్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రోజెక్టులు అభివృద్ది చేస్తే అందరూ అభివృద్ది చెందుతారన్నారు. ప్రభుత్వానికి డబ్బులు వచ్చే పనిని తప్ప రైతులకు పనికి వచ్చే పనిచేయరు సరికదా రైతులపై మమకారం ఉన్నట్లు రైతుల అభివృద్దే ధ్యేయం అని గొప్పలు చెప్పుకుని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రోజెక్టులు పూర్తి చేస్తే దేశం రైతులు అభివృద్ది చెందుతారన్నారు. వెయ్యి టిఎంసిల నీరు సముద్రంలో వృధాగా పోతోందన్నారు. తక్షణమే అదనపు ఆయకట్టు ఆరువేల ఎకరాలకు నీరు విడుదల చేయాలని, రైతులకు ఇవ్వవలసిన నీటిని వెంటనే ఇవ్వాలని పైపులైన్లు ప్రతిపాదన పూర్తి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైవాడ ప్రోజెక్టు రైతులకే అంకితం చేసి కార్పొరేషన్ బకాయి పడ్డ రూ.112 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భీశెట్టి బాబ్జి, లెక్కల అవతారమూర్తి, లెక్కల శ్రీను, ఆదిరెడ్డి చినకన్నబాబు ఉన్నారు.

సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి గంటా
అనకాపల్లి(నెహ్రూచౌక్), ఫిబ్రవరి 14: రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆదివారం మండలంలోని రాజుపాలెం సూర్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. జిల్లా నలుమూలల నుండి భక్తులు ఆదివారం తెల్లవారుజాము నుండే తరలివచ్చి స్వామివారి ని దర్శించుకునేందుకు బారులు తీరా రు. ఈ సందర్భంగా విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, జెడ్పీటిసిలు పల్లెల గంగాభవానీ, టిడిపి నాయకులు మళ్ల సురేంద్ర, గుత్తా ప్రభాకర చౌదరి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ చైర్మన్ కొణతాల బా బూరావు ప్రజాప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారిని ఘ నంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని వారికి అందజేసారు. రథసప్తమి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు కొణతాల బాబూరావు ఆధ్వర్యం లో అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో ఆల య పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. ఈ కార్యక్రమంలో కర్రి కోటేశ్వరరావు, గొల్లవెల్లి రామకోటేశ్వరరావు, చేబోలు సత్యనారాయణ, బుజ్జి, అంజిబాబు పాల్గొన్నారు.