హైదరాబాద్

తరలిపోయిన పెద్ద విమానాలు నేటితో ముగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట, మార్చి 10: బేగంపేట విమానాశ్రయంలో కొలువుదీరిన వింగ్స్ ఇండియా-2018 విమానాల పండుగ శనివారం సందడి సందడిగా సాగింది. ప్ర దర్శనలో కొలువుదీరిన విమానాలను తిలకించడానికి నగర వాసులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఫిక్కీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనకు 2018 సంవత్సరం అంతంత మాత్రమే ప్రదర్శన కొనసాగించారు. ఈ దఫా పెద్ద విమానాలు రాకపోవడం గమనార్హం. హెలికాఫ్టర్లు మాత్రమే ప్రదర్శనలో కొలువుదీరాయి.
ప్రదర్శన గురువారం ప్రారంభం కాగా 17 హెలికాప్టర్లు వివిధ దేశాల నుంచి తరలివచ్చాయి. ఇవి శుక్ర, శనివారం మధ్యాహ్నంలోపు ప్రదర్శనలో కొలువుదీరిన విమానాలు తమతమ దేశాలకు వెళ్లిపోయాయి. కేవలం నాలుగైదు హెలికాప్టర్లు మాత్రమే దర్శనమిచ్చాయి. దీనికి తోడు విమానాల విన్యాసాలు లేకపోవడంతో ఒకింత సందర్శకులు నిరాశకు గురయ్యారు. ప్రవేశ రుసుము 400 రూపాయలు వెచ్చించి ఈ ప్రదర్శన చూడడానికి వచ్చిన సందర్శకులకు కొంత నిరుత్సాహమే మిగిలింది.
విమానాల ప్రదర్శన ఆదివారం సాయంత్రంతో ముగుస్తుంది. శని, ఆదివారాలు శెలవు రోజులు కావడంతో ఈ ప్రదర్శనను తిలకించడానికి సందర్శకులు బారులుతీరారు. సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా నార్త్‌జోన్ డీసీపీ సుమతి పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. బేగంపేట ఏసీపీ రంగారావు, ఇన్‌స్పెక్టర్ అశోక్ రెడ్డి స్థానికంగా మఖాం వేసి బందోబస్తును పర్యవేక్షించారు.