హైదరాబాద్

ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, మార్చి10: మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి తెలంగాణ మున్నూరు కాపు అసోసియేషన్స్ జేఏసీ విజ్ఞప్తి చేసింది. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అధ్యక్షుడు డాక్టర్ కోండాదేవయ్య మాట్లాడు తూ.. రాష్ట్ర జనాభాలో 25శాతం పైగా మున్నూరు కాపు వారు ఉన్నారని , ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తాము చురుకుగా పాల్గోన్నామని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా తమకు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం లభించడం లేదని, ప్రభుత్వం ఇప్పటి వరకు తమ అభివృద్ధికి అవసరమైన పథకాల విషయంలో తమను సంప్రదించలేదని వాపోయారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో 13లక్షల జనాభా ఉన్నట్లు తెలిపిందని నిజానికి తమ జనాభా 40లక్షలకు పైగా ఉందని అన్నారు. మున్నురు కాపులు వ్యవసాయాధారిత వృత్తులలో కొనసాగుతున్నారని, 50 సంవత్సరాలకు పైబడిన మున్నూరు కాపు కులస్థులకు మూడువేల పెన్షన్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు కుటుంబంలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు డబుల్ బెడ్‌రూమ్‌ల కేటాయింపులో ప్రాధాన్యతను ఇవ్వాలని ఆయన కోరారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆర్‌వీ మహేందర్ కుమార్, వేణుగోపాల్, వేంకటేశ్వర్లు, లక్ష్మణ్, పద్మ, గీతారాణి, అనురాధ పాల్గొన్నారు.