Others

కాలం వేగంతో దూసుకుపోయే జీవన ప్రవాహంలో.......

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం వేగంతో దూసుకుపోయే జీవన ప్రవాహంలో వేసిన ప్రతి అడుగు ఒక విజయ రహస్యానికి సంకేతంగా నిలుస్తుంది. అంటే నిజమైన ప్రస్థానం ఇక్కడినుంచే మొదలవుతోంది. ఈ ప్రయాణంలో మనమంతా నిమిత్తమాత్రులమే. ఇందులో కర్త, కర్మ, క్రియ సర్వమూ భగవంతుని ప్రసాదితమే. చేతలు మాత్రమే మనవి. చేయించేవాడు ఆ పైవాడుగా భావించాలి. ఇది లోకవిదితమైన విషయం. అందుకే ‘గీత’లో కృష్ణ్భగవానుడు ఉపదేశం అంత బలంగా భక్తుల హృదయాల్లో కొలువుదీరి సర్వత్రా వ్యాప్తమైంది. ఎవరి కర్తవ్యాన్ని వాళ్లు సక్రమంగా నిర్వహించడం నేర్చుకోవాలి. ఈ భవబంధ సాగరాన్ని ఎదురీది గెలుపు దిశగా పయనించడంలోనే మానవ గొప్పదనం, ఓర్పు, సహనం, వివేకం బయటపడతాయి. ఈ లక్షణాలను సంకల్పంగా భావించి కృతనిశ్చయంతో ఆచరణీయం చేసేవాళ్లకి ఆ భగవంతుని కృపతో పాటు అన్నింటా ఘనవిజయం లభిస్తుందని మనం ఆశించవచ్చు. ఈ ప్రయత్నంలో మనవంతు బాధ్యతను నిర్వర్తించి సమిష్టి విజయానికి బాటలు పరుద్దాం! ఆత్మానుభవంతో ఒదిగిపోయే బుద్ధులన్నీ సదుద్దేశ్యంతో సాగనంపడానికి చేసిన ప్రయత్న ఫలితంగానే భావించాలి. వేదాలు, ఉపనిషత్తులు, పద్య శతకాలు బోధిస్తున్న జీవన సారాంశ రహ్యం ముమ్మాటికీ ఒక చైతన్య బీజాన్ని నాటడానికి చేస్తున్న ఉద్దేశ్యపూర్వక ప్రయత్న ఫలితంగానే భావించాలి.
*