Others

సింహం నడిచొస్తే.. (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఫొటో చూస్తుంటే పులి వెనుక సింహం నడిచొస్తున్నట్టు ఉంది కదూ! ఎన్నో సాత్వికమైన పాత్రల్లో ఒదిగిపోయిన మహానటి -పులిపిల్లను వెంటేసుకెళ్తున్న ఈ సన్నివేశం ఏ చిత్రంలోనిదబ్బా? అంటూ చాలామంది ఆలోచిస్తుంటారు కూడా. కానీ, సినిమా సన్నివేశం కాదు. నిజ జీవితంలో మూగజీవులు, వన్యప్రాణుల పట్ల మహానటి సావిత్రకి ఉన్న మమకారానికి నిలువెత్తు నిదర్శనం. మహానటి సావిత్రి షూటింగ్ ఒత్తిళ్లతో ఎంత బిజీగావున్నా, తన ఇంట్లోని మూగజీవులపై నిరంతరం జాగరూకతతో మెలిగేవారట. షూటింగులు పూర్తి చేసుకుని ఇంటికిరాగానే -తన కోసం ఎదురుచూసే వాటికి ఏంకావాలో దగ్గరుండి చూసుకుంటూ, ఆలనాపాలనా చూసేవారని సన్నిహితులు చెప్పేమాట. అలా ఓ రోజు షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికొచ్చిన మహానటి -అప్పటికి తన ఇంట్లోవున్న పులి పిల్లతో ఇలా షికారుకు బయలుదేరినప్పటి చిత్రం. చిరుత పిల్లను సావిత్రి పెంచుకున్న విషయం చాలామందికి తెలీకపోవచ్చుగానీ, సన్నిహితులు మాత్రం నిజమేనంటారు. ఈ చిత్రం చూస్తే నిజమేనని నమ్మకతప్పదు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717