తెలంగాణ

ధర్మపురిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మార్చి 11: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 10వ తేది వరకు 13రోజుల పాటు నిర్వహించిన శ్రీలక్ష్మీనరసింహ (యోగానంద, ఉగ్ర), శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవ కార్యక్రమాలు శనివారం అర్ధరాత్రితో ఘనంగా ముగిసాయి. ఫిబ్రవరి 27న కళ్యాణోత్సవం, మార్చి 1, 2, 3 తేదీలలో కోనేరులో యోగానంద, ఉగ్ర నారసింహ, వేంకటేశ్వరుల తెప్పోత్సవ, డోలోత్సవాలు, 7న రథోత్సవం, 8, 9, 10 తేదీలలో మువ్వురు స్వాముల ఏకాంతోత్సవ వేడుకల ప్రధాన కార్యక్రమాలకు రాష్ట్రేతర సుదూర ప్రాంతాలనుండి అశేష భక్త, యాత్రిక జనం ఏతెంచి, కార్యక్రమాలలో భాగస్వాములై మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమాల విజయవంతానికి, భక్తులకు వలసిన సదుపాయాల కల్పనకు, సౌకర్యాల మెరుగుదలకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికార, ఉద్యోగ వర్గాలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవాసంస్థల బాధ్యులు సంపూర్ణ సహకారాన్ని అందించి ప్రశంసాపాత్రులయ్యారు. ఆర్టీసీ డిపోలు వ్యూహాత్మకంగా, భక్తుల రద్దీకి అనుగుణంగా, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రత్యేక బస్సులను నడిపాయి. పోలీసుశాఖ ఎలాంటి అవాంఛనీయాలు చోటుచేసు కోకుండా పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంతరాలు కలుగకుండా విద్యుత్‌శాఖ సమయోచిత చర్యలు తీసుకుంది. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక శిబిరాలను నిర్వహించింది. పారిశుద్ధ్య సౌకర్యాల ఏర్పాట్లలో స్థానిక పంచాయతి ప్రత్యేక శ్రద్ధ కనబరచి, క్షేత్రంలో చెత్త చెదారం పేరుకుపోకుండా, అంటు రోగాలు ప్రబలకుండా తగు చర్యలు చేపట్టింది. సాంస్కృతిక కార్యక్రమాలలో వివిధ కళాకారులను, వాద్యకారులను రప్పించి, నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేవస్థానం సిబ్బంది, స్థానిక వేద పండితులు, కళాకారులు వివిధ స్వచ్ఛంద సంస్థల బాధ్యులు అంకిత భావంతో, అలుపెరుగక, అవిశ్రాంత సేవలందించారని దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ఎసి, ఇఓ సుప్రియ, ధర్మకర్తలు ప్రశంసించారు.