తెలంగాణ

శ్రీలక్ష్మీనారాయణస్వామి పాదాలపై సూర్యకిరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, మార్చి 11: నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలంలోని వనిపాకల గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణస్వామి దేవాలయంలో గర్భాలయంలో ఉన్న స్వామివారి పాదాలను సూర్యకిరణాలు తాకాయి. ఈ ఆలయంలో ప్రతి యేటా ఫాల్గుణ, ఆశ్వీయుజ మాసాల్లో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి. ఆలయంలో పూజలను నిర్వహించేందుకు వచ్చిన పూజారి యెడవల్లి దుర్గాప్రసాద్ శర్మ స్వామివారి పాదాలపై సూర్యకిరణాలు తాకిన దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణస్వామి పాదాలపై సూర్యకిరణాలు ఏవిధంగా పడతాయో అదేవిధంగా వనిపాకలలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయంలోని గర్భగుడిలో కొలువైన శ్రీలక్ష్మీనారాయణస్వామి పాదాలను సూర్యకిరణాలు తాకడం విశేషం. సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకడం ఎంతో శుభపరిణామమని గ్రామస్తులు భావిస్తున్నారు. ఎంతో దూరంలో ఉన్న అరసవల్లికి వెళ్ళి వీక్షించుకోలేని వారికి తమ గ్రామంలో ఇలాంటి దృశ్యాలు రావడం సంతోషమని గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

chitram...
వనిపాకలలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి దేవాలయం. గర్భగుడిలో స్వామివారి పాదాలను తాకిన సూర్యకిరణాలు