తెలంగాణ

సాగు నీరు ఎలా తెస్తారో చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్
హైదరాబాద్, మార్చి 12: ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును రూపొందించడంలో రంగారెడ్డి జిల్లాకు సాగు నీరు ఎలా అందిస్తారో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పాలని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు డిజైన్ మార్చి రంగారెడ్డి జిల్లా ఆయకట్టుకు నీరు లేకుండా చేశారని ఆమె శనివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీరు అందిస్తామని ఒకవైపు చెబుతూ, మరోవైపు పాములపర్తి జలాశయం నుంచి మేడ్చల్ నియోజకవర్గంలో నీరు అందిస్తామని హామీ ఇచ్చారని, ఇంకోసారి దిండి జలాశయం నుంచి మహేశ్వరం, ఇబ్రహీపట్నం నియోజకవర్గాలకు నీరు అందిస్తామని చెప్పారని, వీటిలో ఏది నమ్మాలో అర్థం కావడం లేదని, ఎక్కడా స్పష్టత లేదని ఆమె విమర్శించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని లేని పక్షంలో ప్రజల పక్షాల నిలబడి పోరాటాలు చేస్తామని ఆమె హెచ్చరించారు.

‘మహారాష్టత్రో కుదిరిన ప్రాజెక్టు
ఒప్పందాలను బహిర్గతం చేయాలి’
హైదరాబాద్, మార్చి 12: గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్టత్రో కుదిరిన ఒప్పందాలన్నింటిని బహిర్గతం చేయాలని తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక వైపు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తెలంగాణ ప్రభుత్వంతో జలవివాదాల పరిష్కారానికి అంతరాష్ట్రీయ మండలి ఏర్పాటైందే తప్ప తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందాలు జరగలేదని ప్రకటించడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్రానికి చాలా అవసరం, కానీ తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్మాణాలు ప్రారంభించిన ప్రాజెక్టులను ఆపడం, వాటి డిజైన్ మార్చడం ద్వారా వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ఏక పక్ష నిర్ణయాలు రాష్ట్ర ప్రయోజనాలకు హానికరమని వెల్లడించారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆ ఒప్పందాలేంటో ఇప్పటికైనా బహిరంగపర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులపై విద్యుత్ సంస్థలు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని సిపిఐ నేత తమ్మినేని డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా విద్యుత్ ఉద్యోగులెవరూ ఇఆర్‌సి విచారణ, కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు నిర్ణయం తీసుకోవడం అన్యాయమని అన్నారు.