జాతీయ వార్తలు

విస్తత్ర ధర్మాసనానికి శబరిమల వ్యవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:శబరిమల వ్యవహారంపై ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోని మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఆలయంలోకి మహిళలను అనుమతించాలా? వద్దా? అనే అంశంపై ఏడుగురు సభ్యులు గల విస్తత్ర ధర్మాసనానికి బదిలీ చేసింది. గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని దాఖలైన పిటిషన్లను కోర్టు పెండింగ్‌లో ఉంచింది. ఈ వ్యవహారాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయాలనే నిర్ణయంపై ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోని జస్టిస్ నారీమన్, జస్టిస్ చంద్రచూడ్ వ్యతిరేకించగా, మిగిలిన ముగ్గురు బలపరిచారు. తీర్పును వెలువరిస్తూ సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ ఇలా అన్నారు..‘‘ మతం అనేది మనిషికి, దైవానికి అనుసంధానం చేసేది. ప్రార్థనాస్థలాల్లోకి మహిళల ప్రవేశం అనేది ఈ ఒక్క ఆలయానికి పరిమితం కారాదు. ఈ ఒక్క మతానికే పరిమితం కారాదు. ఇపుడు మసీదుల్లోకి మహిళల ప్రవేశం అనే అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మత విధానాల్లోకి కోర్టులు జోక్యం చేసుకునే అధికారం ఉందా? అనే అంశంపై ఇపుడు చర్చకు వచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. మొత్తానికి శబరిమల వ్యవహారంపై 3:2 నిర్ణయంపై కోర్టు తీర్పు చెప్పింది.

శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 సంవత్సరాల మహిళలకు ప్రవేశాన్ని నిరాకరిస్తూ ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. కాగా ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ తీర్పును పునఃసమీక్ష జరపాలని కోరుతూ నాయర్‌ సర్వీసెస్‌ సొసైటీ, దేవస్థాన తంత్రులు, ట్రావెన్‌కోర్‌ దేవసం బోర్డు సహా పలువురు భక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేరళ ప్రభుత్వం కూడా పిటిషన్‌ దాఖలు చేసింది. మొత్తంగా ఈ వ్యవహారంలో 65 పిటిషన్లు దాఖలయ్యాయి.