జాతీయ వార్తలు

శబరిమలకు కొత్త చట్టం:సుప్రీం కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:శబరిమల ఆలయ నిర్వహణకు కొత్త చట్టం చేయాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. జనవరి మూడోవారంలోగా ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలని కోరింది. ఇతర ఆలయాలతో కలిపి చట్టం తీసుకురావటం సమంజసం కాదని జస్టిస్ ఎస్వీవి రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పండలం రాజకుటుంబం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేయటం జరిగింది. కాగా శనివారంనాడు ఆలయ ప్రధాన అర్చకుల పూజలతో ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. అయప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు .
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రధాన పూజారి కందరారు మహేశ్ మోహనరారు ఆలయ ద్వారాన్ని తెరిచి, అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు. కొత్త పూజారులు ఎకే సుధీర్ నంబూద్రి (శబరిమల), ఎంఎస్ పరమేశ్వరన్ నంబూద్రి (మల్లికాపురం) గర్బగుడిని తెరిచారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ దీక్షబూనిన భక్తుల నినాదాల మధ్య భక్తులు వందల సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఇలావుండగా శబరిమలలో అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో ధర్మాసనం ఈ కేసును ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం బోర్డు అన్ని చర్యలు చేపట్టింది.
ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన 10 మంది మహిళలను పోలీసులు పంబ ప్రాంతంలోనే అడ్డుకుని వెనక్కి పంపించారు.పుదుచ్చేరి నుంచి ఓ బాలికను వయసు నిర్థారణ సర్ట్ఫికెట్ పరీశీలించి ఆ బాలికకు 12 సంవత్సరాలు ఉండటంతో వెనక్కి పంపేశారు.