జాతీయ వార్తలు

శబరిమలలో మహిళలపై ఎందుకు వివక్ష?: సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: భారత రాజ్యాంగం ప్రకారం మహిళలకూ పురుషులతో పాటు అన్ని హక్కులు ఉన్నాయని, అయితే ఆలయాల్లో మహిళల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడంపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంలో విచారణ మొదలైంది. మహిళలకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలను ఇవ్వకుండా ఎవరూ అడ్డుకోలేరని, ఇందుకు భిన్నంగా ఎవరైనా వ్యవహరిస్తే అది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. రాజ్యాంగం కంటే సంప్రదాయం గొప్పదా? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మన దేశంలో ‘మాత’ అనే పదానికి ఎంతో ఉన్నతమైన అర్థం ఉందని, అయినా ఆలయాల్లో మహిళలను అడ్డుకునే హక్కు ఎవరు ఇచ్చారని కోర్టు నిలదీసింది.