జాతీయ వార్తలు

శబరిమలపై అఖిలపక్ష సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ తీర్పుపై దాదాపు 49 రివ్యూ పిటిషన్లు దాఖలైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో అన్ని వయసుల మహిళల ఆలయ ప్రవేశంపై చర్చించనున్నారు. ఆలయ ప్రవేశ కోసం 500 మంది మహిళలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అలాగే రెండు నెలల పూజల కోసం ఈనెల 17న ఆలయం తెరుచుకోనున్నది. ఇదిలావుండగా ఈనెల 17న శబరిమలను దర్శించుకునేందుకు తనకు భద్రత కల్పించాల్సిందిగా సామాజిక కార్యకర్త తృప్తిదేశాయ్ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కోరారు.