జాతీయ వార్తలు

సభ సజావుగా నడిపేందుకు సహకరించాలి:స్పీకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోకసభ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కొత్త స్పీకర్‌గా ఎన్నికైన ఓంబిర్లా కోరారు. లోకసభ సభ్యుల ప్రమాణ స్వీకారం చేసిన తరువాత స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఓంబిర్లా సభనుద్దేశించి మాట్లాడుతూ సభను నిష్పక్షపాతంగా నడిపేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని అన్నారు. సభ్యులు అడిగే సమస్యలపై సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. పార్టీల బలాబలాలకు అతీతంగా సభను నడుపుతానని, ప్రతిఒక్కరి ప్రయోజనాలను కాపాడతానని వెల్లడించారు. సమయం వృథా కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అంశాలను మాత్రమే ప్రస్తావించాలని అన్నారు.