ఆటాపోటీ

చెలరేగిన సచిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామనె్వల్త్ బ్యాంక్ ముక్కోణపు వనే్డ సిరీస్ మొదటి ఫైనల్‌లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ చెలరేగిపోవడంతో భారత్‌కు ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధ్యమైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. మాథ్యూ హేడెన్ 82 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మైక్ హస్సీ 45 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఒకానొక దశలో 87 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీనితో జట్టును ఆదుకునే బాధ్యత సచిన్‌పై పడింది. అతను అజేయంగా 117 పరుగులు చేయడమేగాక, రోహిత్ శర్మ (66)తో కలిసి నాలుగో వికెట్‌కు అత్యంత కీలకమైన 123 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. 45.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 242 పరుగులు చేసి భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. ఈ విజయంలో ముఖ్యభూమిక పోషించిన సచిన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

===

మళ్లీ అతనే!
సిడ్నీ మైదానంలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని, బ్రిస్బేన్‌లో జరిగిన కామనె్వల్త్ బ్యాంక్ రెండో ఫైనల్‌లోనూ భారత్ అద్భుత ప్రతిభ కనబరచింది. ఆస్ట్రేలియాను తొమ్మిది పరుగుల తేడాతో ఓడించింది. మొదటి ఫైనల్‌లో టీమిండియాను గెలిపించిన సచిన్ తెండూల్కర్ రెండో ఫైనల్‌లోనూ కీలక పాత్రపోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. సచిన్ 91 పరుగులు సాధించాడు. బ్రాకెన్ 31 పరుగులకు 3, మైఖేల్ క్లార్క్ 52 పరుగులకు 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ మిడిల్ ఆర్డర్ కొంత మెరుగ్గా ఆడినా, టాప్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగా 49.4 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ హేడెన్ 55, ఆండ్రూ సైమండ్స్ 42, మైక్ హస్సీ 44, జేమ్స్ హోప్స్ 63 పరుగులు చేసి ఆసీస్ అభిమానులకు విజయంపై ఆశలు కల్పించారు. కానీ ఆతర్వాత అంతా పరుగుల వేటలో విఫలం కావడంతో ఆసీస్ తొమ్మిది పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.