రాష్ట్రీయం

సేఫ్టీ, సెక్యూరిటీపై తొలి జాతీయ సదస్సు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: దేశంలోనే తొలిసారిగా సేఫ్టీ, సెక్యూరిటీపై సదస్సుకు హైదరాబాద్ వేదిక అయ్యింది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును డిజిపి అనురాగ్‌శర్మ గురువారం ప్రారంభించారు. సైబరాబాద్ పోలీసు విభాగం, హైటెక్స్ కనె్వన్షన్ సెంటర్లు ఈ సదస్సు నిర్వహణకు సహకారం అందిస్తున్నాయి. హ్యూమన్ సేఫ్టీ, వర్క్‌మెన్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ సేఫ్టీ, కంట్రోల్ వంటి అంశాలపై ఈ సదస్సులో లోతుగా చర్చిస్తున్నారు. ఇనె్వస్టర్స్ డెస్టినేషన్‌గా హైదరాబాద్ నిలుస్తుందని, భారీ పరిశ్రమలు చాలా తరలి వస్తున్నందున సెక్యూరిటీ, సేఫ్టీ వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చర్చలో పాల్గొన్న పలువురు వెల్లడించారు.దేశంలో సేఫ్టీ, సెక్యూరిటీ పరిశ్రమ కేవలం 0.06 శాతం జిడిపిని అందిస్తుందని తెలిపారు. దాదాపు 75 మందికిపైగా ట్రేడ్ ఎగ్జిబిటర్లు ఈ సదస్సులో పాల్గొననున్నారు. సుమారు 5 వేల మంది సందర్శకులు ఈ మూడు రోజు జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్‌లో పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేశారు.