చిత్ర

సాధించాల్సిందే!

  • 23/02/2012

మొదట నటిని అవుదామని అనుకోకపోయినా, ఇప్పుడు అయ్యాను కనుక నటనలో ఏదైనా సాధించాల్సిందేనని చెబుతోంది కేరళ కుట్టి అసిన్. ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడు చాలా త్వరగానే హిట్లు కొట్టేసి ముంబాయి రూటుపట్టింది. అక్కడికి వెళ్లాక రెండడుగులు ముందుకి ఒక అడుగు వెనక్కి అన్నట్లు ఆమె కెరీర్ సాగుతోంది. ఇక లాభంలేదని పెళ్లిచేసుకోమని సలహాలిస్తే ఏదో ఒకటి సాధించి కానీ ఇక్కడ్నించి వెళ్లనంటోంది. దానికితోడు మరెన్నో ఆశలు కూడా వివరించి చెప్పింది. గ్లామర్ నటిగా రాణించాలని కోరుకుంటున్నట్లు, దానికి వ్యతిరేకమైన ఆర్ట్ ఫిల్మ్‌ల్లో నటించి అవార్డులు తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. అయినా 26 ఏళ్ల వయసులో పెళ్లిచేసుకుని, పిల్లల్ని కని పెంచడం తన వయసుకు అంత అవసరమా అని ప్రశ్నించింది. సినిమా పరిశ్రమలో ఏదీ సాధించలేనప్పుడు, కనీసం పెళ్లిచేసుకునైనా మొగుడ్ని సాధించవచ్చు కదా అని తోటి హీరోయిన్లు సన్నాయి నొక్కులు నొక్కుతుంటే కోపమొస్తోందట అసిన్‌కి. ప్చ్..!

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading